అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. పాక్ లో మోడీ పర్యటన

modi-sharifప్రధాని నరేంద్ర మోడీ… పాకిస్థాన్ కు వెళుతున్నారు. అదేంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఆయన.. పాక్‌లో పర్యటించడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇది నిజం. ఆఫ్ఘనిస్తాన్‌ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి నుంచి నేరుగా లాహోర్‌ చేరుకోనున్నారు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి… ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. పాక్‌ పర్యటన వివరాలను మోడీ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలిపారు. ప్రధాని అయ్యాక మోడీ పాక్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. పాక్‌లో ఆకస్మికంగా పర్యటించనున్న తొలి భారత ప్రధాని కూడా మోదీనే.

modi-tweet

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy