వరల్డ్ – 2015

roundup world 2015కాలగమనంలో మరో ఏడాది.. 2016. నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరం స్వాగతం పలుకుతోంది. అయితే గతం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. అయితే 2015లో జరిగిన ఘటనలు.. వాటి ప్రాధాన్యం ఏంటో మీరే చదవండి…

 • ఏప్రిల్ 2న కెన్యాలోని గరిస్సా యూనివర్శిటీలో అల్ ఖాయిదా ఉగ్రవాదులు కాల్పులు జరిపడంతో కొంతమంది స్టూడెంట్స్ చనిపోయారు. సోమాలియాకు 200 కిమీ దూరంలో ఉన్న గరిస్సా..పూర్తిగా రక్షణకవచంలో ఉన్న ప్రదేశం. మిలిటరీ, పోలీసులు ఉండే ప్రాంతం. అయినా..అక్కడ అల్ ఖాయిదా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా కొంతమంది స్టూడెంట్స్ పై కాల్పులు జరిపారు. సుమారు 148 విద్యార్ధులు ఈ దాడుల్లో మరణించారు. 79 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
 • ఏప్రిల్ 25న భూకంపం నేపాల్ ను కుదిపేసింది. ఇళ్లు సమాధులయ్యాయి. ఊర్లు స్మశానంగా మారింది. సుమారు 9 వేలమందికి పైగా ఈ భూకంపానికి బలైపోయారు. 23 వేల మందికి పైగా…గాయపడ్డారు. భూకంపం రిక్టార్ స్కేల్ పై 7.8గా నమోదయింది. ఇది.. చుట్టుపక్కల దేశాలనూ కుదిపేసింది. ఇండియాలో 130 మంది, చైనాలో 27 మంది బంగ్లాదేశ్ లో 4 మంది ఈ భూకంపంలో మరణించారు.
 • సెప్టెంబర్ 2న మూడేళ్ల బాలుడు ఎలాన్ కుర్దీ బాడీ.. సముద్రంలోంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఫోటో… యావత్ ప్రపంచాన్నే కుదిపేసింది. కర్కోటకులకు సైతం కన్నీరు పెట్టించింది. … సిరియా శరణార్దుల సంక్షోభంతో ఎలాన్ బాడీ మెడిటెరానియన్ సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇది ఎలాన్ సమస్య మాత్రమే కాదు…అంతర్జాతీయ సమస్య గా వర్ణించారు.
 • సెప్టెంబర్ 11న ముస్లీంల పవిత్ర స్థలమైన మక్కాలో అపశ్రుతి చోటుచేసుకుంది. హజ్ పురస్కరించుకుని మసీదు మరమ్మతు పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ… క్రేన్ పడిపోవడంతో…111 మంది మరణించారు. 394 మంది తీవ్రంగా గాయపడ్డారు.
 • సెప్టెంబర్ 28న అంగారకుడిపై నీళ్లు ఉన్నాయని గుర్తించింది..నాసా. అప్పటికే మానవులు జీవించేందుకు మార్స్ అనువైన ప్రదేశం అని తేల్చి చెప్పిన నాసా…అక్కడ నీళ్లు కూడా కనబడుతున్నాయని ఆధారాలతో సహా నిరూపించింది.
 • సెప్టెంబర్ 30న సిరియాలో ఐఎస్ఐఎల్ , యాంటీ గవర్నమెంట్ ఫోర్స్ పైన రష్యా వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు సిరియా ప్రభుత్వం సహకారంతో నిర్వర్తించింది…రష్యా.
 • అక్టోబర్ 10న టర్కీలో సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. టర్కీకి సమీపంలో మెయిన్ ట్రైన్ స్టేషన్ లో శాంతియుత ర్యాలీ చేస్తున్న ప్రజలపై ఈ బాంబ్ ఎటాక్ జరిగింది. 100 మంది చనిపోయారు. సుమారు 400 మంది గాయపడ్డారు. మరో మూడు వారాల్లో టర్కీ ఎలక్షన్స్ జరగబోయే ముందు.. ఈ సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది.
 • నవంబర్ 8న దశాబ్దాల చీకటి పాలనుకు అంతం పలికిన వెలుగురేఖ.. అంగ్సాన్ సూచీ… మయన్మార్ ఎలక్షన్ లో విజయం సాధించింది. 70 ఏళ్ల వయసులో కూడా సైనిక పాలనతో పోరాడి నెగ్గిన వీర వనితగా చరిత్రలో నిలిచిపోయింది. రెండున్నర దశాబ్దాల తర్వాత జరిగిన మయన్మార్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మూడింట రెండొంతుల మెజారిటీని నేషనల్ లీగ్ ఫర్ డెమక్రసీ పార్టీ సాధించింది.
 • నవంబర్ 13న పారిస్ ప్రాంతం రక్తంతో నిండిపోయింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో సెయింట్ డెనిస్, బటాక్లాన్ థియేటర్ లలో ఉగ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఈ సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ లో సుమారు 200 మంది చనిపోయారు. 368 మంది గాయపడ్డారు. ఆ సమయంలో దేశ ప్రధాని కూడా అక్కడే ఉన్నా…సురక్షితంగా బయటపడ్డారు. ఐసిస్ జరిపిన ఈ దాడులను పారిస్ తో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలూ ఖండించాయి.
 • ప్రపంచం వేడి సెగలతో రగిలిపోతోంది. మనిషి స్వార్ధానికి ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఎక్కడ చూసినా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో..ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరగకుండా… పారిస్ లో అంతర్జాతీయ వాతావరణ సదస్సును ఏర్పాటు చేసింది. ఇది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకూ కొనసాగింది. సదస్సు ముగిసే సమయానికి అన్ని దేశాలు కర్బన వాయువుల నియంత్రణపై ఒక మాటపై రాలేకపోయినా… వాతావరణంలో రెండు డిగ్రీల సెల్సియస్ పెరగకుండా కాపాడతామని ఓ నిర్ణయానికి వచ్చాయి.
 • డిసెంబర్ 1న పారిస్ లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సులో ఇండియా, పాకిస్థాన్ ప్రధానులు కాసేపు రహస్యంగా ముచ్చడించారు. దాంతో భారత్, పాకిస్తాన్ దేశాల చర్చల్లో ఎవరూ ఊహించని ముందడుగు పడింది. ఆ తర్వాత బ్యాంకాక్ లో ఇరుదేశాల భధ్రతా సలహాదారులు సమావేశమై ఉగ్రవాదం, కశ్మీర్, ఇతర ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
 • పిల్లలు పుడితే వారికి ఎంత సంపాదించి ఇవ్వాలా…అని ఆలోచించేవారున్నారు. అందులోనూ ఆడపిల్ల పుడితే.. ఎంత ఆస్తి కూడబెట్టి ఇవ్వాలా…అని ఆలోచిస్తుంటారు. కానీ ఇది ఒకప్పుడు. ఫేస్ బుక్ సీఈవో.. జుకర్ బర్గ్. జుకర్ బర్గ్ దంపతులు తమ చిన్నారిని ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ… ఫేస్ బుక్ కంపెనీలోని షేర్లలో 99 శాతాన్ని విరాళంగా ఇచ్చారు. వ్యాధులకు చికిత్స, హరిత విద్యుత్తు ఉత్పత్తి, ప్రజల అనుసంధానత, బలమైన సామాజిక బృందాల నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలకు ఆ డబ్బును దానం చేశారు.
 • డిసెంబర్  నెలలో చైనా బీజింగ్ తో పాటు మరో 20 పట్టణాలలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. స్కూళ్లు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు…రవాణా అంతా మూతపడింది. వాతావరణంలో పూర్తిగా కాలుష్య వాయువు కమ్ముకోవడంతో…ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పొగమంచు కాలుష్యం వల్ల ప్రజలకు భయంకర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో… చైనా ప్రభుత్వం ప్రజలను ఇంటి నుండి బయటకు రాకుండా చేసింది. ఇంటి నుంచి బయటకు రాలేక, పనులు చేసుకోలేక.. తిండిలేక ప్రజలు… కొన్నాళ్లు అల్లాడిపోయారు.
 • డిసెంబర్ 19న భారత్ రత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాను దైవదూతగా వాటికన్ సిటీ ధ్రువీకరించినట్లు మిషనరీస్ ఆఫ్ చారిటీ తెల్పింది. వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించిన మదర్ కు ఈ హోదా దక్కినట్లు వెల్లడించారు. మదర్ లోని అతీత శక్తిని పోప్ గుర్తించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 4న మదర్ థెరిస్సాకు రోమ్ లో అధికారికంగా హోదా ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
 • డిసెంబర్ 20 న జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో అప్రశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం ఫిలిప్పీన్స్ కు చెందిన పియా అలోంజో ను వరించింది. రెండో స్థానంలో కొలంబియా సుందరి అరియాడ్నా నిలిచారు. అయితే ఈ పోటీ విజేతల ప్రకటనలో కొంత గందరగోళం చోటు చేసుకుంది. కార్యక్రమనిర్వాహకుడు స్టీవ్ హార్వే మొదట విన్నర్, రన్నర్ పేర్లను పొరపాటున మార్చి ప్రకటించాడు. దాంతో రెండవ స్థానంలో నిలిచిన ఆరియాడ్నాను మిస్ యూనివర్స్ గా డిక్లేర్ చేసి కిరీటం పెట్టారు. తర్వాత నాలుక కరుచుకుని… ఆ కిరీటాన్ని తీసి మరలా ఫిలిప్పీన్ సుందరి తలలో అమర్చారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy