గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి:కేసీఆర్

KCR-1

అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. దుబ్బాక నియోజకవర్గానికి వరాల జల్లు.. అధికారులతో సమీక్షలు.. టీచర్లు, పాత మిత్రులతో సమావేశాలతో.. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు.. నాన్ స్టాప్ విజిట్స్ తర్వాత.. హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.. సీఎం.. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. జగదేవ్ పూర్ మండలం నర్సన్నపేట గ్రామంలో కుడవల్లివాగు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో.. గజ్వేల్, దుబ్బాక, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రైతులకు ఉపయోగమని సీఎం చెప్పారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో డ్రిప్ ఇరిగేషన్ పై దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండగ ఎర్రవల్లిలోనే చేసుకుంటానన్నారు… సీఎం.నర్సన్నపేట నుంచి హెలికాఫ్టర్ లో దుబ్బాక వెళ్లారు సీఎం. తను చిన్నపుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులతో పాటు.. రామసముద్రం చెరువు పనులు, 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత దుబ్బాక సెగ్మెంట్ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. తాను చదువుకున్న స్కూల్ లోనే జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఓ పద్యం కూడా చెప్పారు.మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో సాగు, తాగు నీటి కష్టాలు తీరనున్నట్టు రివ్యూలో చెప్పారు.. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. మిషన్ కాకతీయ ఫేజ్ వన్ తో మంచి ఫలితాలు సాధించామన్నారు. మెదక్ జిల్లాకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ పెండింగ్ పనులను.. సెకండ్ ఫేజ్ తో కలిపి పూర్తి చేయనున్నట్టు చెప్పారు. చివరగా.. దుబ్బాకలోని తన చిన్ననాటి గురువులు, స్నేహితులతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆత్మీయ సమావేశానికి సీఎం అటెండయ్యారు. అందరి సహకారంతోనే ఇంతటివాడినయ్యానంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

KCR-3

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy