శ్రీకృష్ణ పాండవీయం @ 50

srikrishna pandaveeyamపౌరాణిక సినిమాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆయనకు ఈ పేరును సార్థకం చేసిన సినిమాల్లో శ్రీకృష్ణ పాండవీయం ఒకటి. కృష్ణుడిగా, దుర్యోధనుడిగా రెండు పాత్రల్లో జీవించిన మహానటుడు రామారావు. పాండవులు, దుర్యోధనుడి కోణంలో ఈ సినిమా నడుస్తుంది. తెలుగులో వచ్చిన అజరామర చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 50 ఏళ్లు. 1966 జనవరి 13న దీన్నిరిలీజ్ చేశారు. మహాభారతంలో ఆది, సభాపర్వాల్లోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. నేషనల్ ఆర్ట్ థియేటర్, రామకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. అప్పట్లో దీనికైన ఖర్చు 10 లక్షల రూపాయలు. దీనికి ఎన్టీఆరే దర్శకత్వం వహించారు. చిత్తూరు నాగయ్య, కాంతారావు, శోభన్ బాబు, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, కేఆర్ విజయ లాంటి మహానటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సని పాత్ర శకుని. ఈ పాత్ర ధూలిపాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. సముద్రాల రాఘవాచార్య, సినారె, కొసరాజు లిరిక్స్ అందించగా.. టీవీరాజు సంగీతమందించారు. సముద్రాల మాటలు కూడా సినిమాను సూపర్ హిట్ చేశాయి. ఆ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది శ్రీకృష్ణపాండవీయం. సినిమా నిడివి 3 గంటల 7 నిమిషాల 44 సెకన్లు.

ఈ పాటలు ఇప్పటికీ నిత్యనూతనం…

  • చాంగురే బంగారు రాజా..
  • మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

 

ఎవరెవరు ఏ క్యారెక్టర్…

  • ఎన్టీఆర్: శ్రీకృష్ణ, దుర్యోధనుడు
  • ఉదయ్ కుమార్: భీష్ముడు
  • కేఆర్ విజయ: రుక్మిణి
  • కాంతారావు: నారద
  • మిక్కిలినేని: భీముడు
  • రాజనాల: శిశుపాల
  • ప్రభాకర్ రెడ్డి: కర్ణుడు
  • శోభన్ బాబు: అర్జునుడు
  • ధూళిపాల: శకుని

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy