498A పదును తగ్గబోతోంది..!!

now-fatwa-against-organising-dinner-lunch-with-dowry-money_031114014434ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498 A లో  సవరణలు చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. భర్తను,  అత్త వారింటి తరపు బంధువులను ఇబ్బంది పెట్టేలా ఈ చట్టాన్ని కొందరు లేడీస్ మిస్ యూజ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కుటుంబంలో చిన్నచిన్న గొడవలకు, వ్యక్తిగత కక్ష సాధింపునకు కూడా  దీన్ని వాడుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో 498 ఏ చట్టాన్ని సవరించి.. రాజీ పడేందుకు వీలున్న నేరంగా మార్చాలని భావిస్తోంది. దీని ద్వారా కోర్టు బయట సర్దుబాటుకు వీలు కలుగుతుందన్నది కేంద్రం ఆలోచన. 498 A చట్ట సవరణపై గతంలో లా కమిషన్, జస్టిస్ మాలిమత్ కమిటీ పలు సిఫార్సులు చేశాయి. ఆ సిఫార్సులపై ఓ డెసిషన్ తీసుకున్న హోంశాఖ.. తమ ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ సెక్షన్ కింద కేసు ఫైలయితే ఫైన్ తో గానీ, బెయిల్ పై గానీ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. రాజీకి కూడా అవకాశం లేదు. కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు భర్త, అత్తింటి తరపు వారు తప్పుచేసినట్టే లెక్క. నేరం రుజువైతే.. గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. 498 A  కింద ప్రతి యేటా 10 శాతానికి పైగా తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. దీనికి బ్రేక్ వేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది అయితే ఈ ఛేంజేస్ ను మహిళా సంఘాలు అపోజ్ చేస్తున్నాయి. ఇప్పుడున్న రూపంలోనే చట్టాలన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధిత మహిళలకు రక్షణ కల్పిస్తున్న చట్టంలో మార్పులు చేస్తే.. వేధింపులు పెరిగే ఛాన్సుందని లేడీలాయర్స్ వాదిస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy