50లక్షల ఫాలోవర్స్ తో టాప్ ప్లేస్ లో అల్లు అర్జున్…

allu 2150906allu 2150829 allu 1150604 allu 1150406టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశాడు. రేసుగుర్రం హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న బన్నీ తాజాగా కొత్త రికార్డ్ సాధించాడు. ఇప్పటికే తన స్టైల్, డ్యాన్స్, నటనతో ఫ్యాన్స్ ను అలరించిన బన్నీ..ప్రస్తుతం 50 లక్షల క్లబ్ లో చేరాడు. సౌత్ హీరోల్లో ఎవరికీ  సాధ్యం కానీ ఘనత సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఫేస్ బుక్ లో మన స్టైలీష్ హీరోని ఫాల్ అయ్యేవారి సంఖ్య 50 లక్షలకు చేరుకుంది.

సౌత్ లో అందరు హీరోల కంటే బన్నీనే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. దీంతో ఆనందం పట్టలేని బన్నీ…తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం బాషల్లో అంత మంది హీరోలు ఉన్నా నన్ను ఎంకరేజ్ చేయడం సంతోషంగా ఉందన్నాడు.  రేసుగుర్రం మూవీ తన కెరీర్ లోనే చాలా స్పెషల్ గా నిలిచిందన్నారు.

ఇక అతి త్వరలోనే బన్ని-త్రివిక్రమ్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్ లో రాణి రుద్రమ దేవీ మూవీలో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు అర్జున్.  దీని తర్వాత త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ కానుంది. రాణి రుద్రమ దేవీ మూవీ కోసం బన్నీ స్టంట్లు నేర్చుకుంటున్నాడు. గతంలోనూ బద్రీనాద్ మూవీ కోసం బన్నీ భారీ ఎత్తున డ్యాన్స్ లు ప్రాక్టీస్ చేశాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy