50 ఏళ్లప్పుడు మళ్లీ శబరికి వస్తా.. చిన్నారి ఫొటో సందేశం

కేరళ :  కేరళలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం వివాదాస్పదం అవుతున్న వేళ ఓ చిన్నారి సందేశంతో ముందుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది. శనివారం ఉదయం తొమ్మిదేళ్ల చిన్నారి శబరిమల గుడిలో ప్రత్యేకంగా కనిపించింది. ఆమె చేతిలో ఓ ఎల్లోకలర్ ప్లకార్డ్ అంది. నా పేరు జనని. నేనిప్పుడు 9 ఏళ్ల వయసులో శబరిమల గుడికి వచ్చాను. నా వయసు 50 ఏళ్లు దాటినప్పుడు మళ్లీ శబరిమలకు వస్తాను. అప్పటిదాకా ఎదురుచూస్తుంటా …. అని ఆ ప్లకార్డ్ లో మెసేజ్ ఉంది.

తొమ్మిదేళ్ల చిన్నారి జనని చేతిలో ప్లకార్డ్… అందులోని మెసేజ్ చూసి.. మీడియా వారిని సంప్రదించింది. చిన్నారి తన తండ్రితో కలిసి మధురై నుంచి శబరిమల గుడికి వచ్చినట్టు చెప్పింది. శబరిమల గుడికి ప్రత్యేకత ఉందని.. దానిని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తామని చిన్నారి తండ్రి చెప్పాడు. ఎంతో నిష్టతో, ప్రత్యేక నియమాలతో దీక్ష పూర్తిచేస్తేగానీ… శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోలేమని ఆయన చెప్పాడు. కూతురుకి దేవుడిని చూడాలన్న కోరిక ఉంది కాబట్టే.. తన వయసు పదేళ్ల లోపు ఉన్నప్పుడే గుడికి తీసుకొచ్చానని అన్నాడు.

కేరళలో అయ్యప్పను అన్ని వయసుల ఆడవాళ్లు దర్శించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు తర్వాత…. జరిగిన పరిణామాలు దేశంలో సంచలనం కలిగిస్తున్నాయి. అక్టోబర్ మూడో వారంలో ఆలయం తలుపులు తెరిచిన వేళ… దైవ దర్శనంకోసం కొందరు మహిళలు… భారీ సెక్యూరిటీ నడుమ ప్రయత్నం చేశారు. ఐతే… గుడి ప్రధాన పూజారి హెచ్చరికలతో… వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో తొమ్మిదేళ్ల చిన్నారి జనని పెట్టిన ప్లకార్డ్ మెసేజ్ పై చర్చ జరుగుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy