50 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు 279/7

145655
ఆసియా కప్ లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. ముష్ఫిక్యూర్ 117 పరుగులతో బంగ్లాదేశ్ కు మంచి స్కోర్ అందించాడు. సోంత గడ్డ మీద మ్యాచ్ జరగడంతో బంగ్లా గట్టి పోటీని ఇచ్చింది. వికెట్లు తీయడంతో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మహ్మద్ షమీ, జడేజా తప్ప మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
కొత్తగా వచ్చిన వరుణ్ అరోణ్ కేవలం 7.4 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చారు. బౌలర్లు కూడా ఇన్సింగ్స్ ఎక్స్ ట్రాలు ఇచ్చారు. అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అరోణ్ తలో వికెట్ తీశారు. నాలుగు వికెట్లు తీసి షమీ బంగ్లాదేశ్ మరిన్ని పరుగులు చేయకుండా ఆపగలిగారు. రహీం, అనమూల్ హుక్ తప్ప మిగతా బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ రాణించలేదు. టీం ఇండియాకు 280 పరుగుల లక్ష్యాన్ని అందించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy