50 మంది మృతి : ఉత్తరాదిని వణికిస్తున్న దుమ్ము తుఫాన్, భారీ వర్షాలు

dustభారీ వర్షాలు, దుమ్ము తుఫాన్ ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో పిడుగులు పడి, ఇల్లు, చెట్లు కూలి ఇప్పటి వరకు 30 మందికి పైగా చనిపోయారు. ఉత్తరప్రదేశ్ లో వడగళ్ల వర్షం కారణంగా 18 మంది చనిపోయారని, 28 మందికి గాయాలయ్యాయని అధికారులు ప్రకటించారు. పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. బులంద్ షహర్ లో పిడుగుపడి పదికి పైగా గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు యూపీ సీఎం ఆదిత్యనాథ్. గాయపడిన వారికి ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు.

వెస్ట్ బెంగాల్ లో పిడుగులు 12 మందిని బలితీసుకున్నాయి. పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. హౌరా జిల్లా ఉలుబెరియాలో ఐదుగురు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులున్నారు. గాలి వానకు కిందపడిన మామిడికాయలు ఏరుకునేందుకు తోటలోకి వెళ్లిన చిన్నారులపై పిడుగు పడటంతో స్పాట్ లోనే చనిపోయారు. పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాల జిల్లా, నదియాలో వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. మృతుల కుటుంబాలను సంతాపం తెలిపారు సీఎం మమతా బెనర్జీ. చనిపోయిన వారిని తీసుకురాలేమన్న ఆమె.. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. నష్టాన్ని అంచనా వేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. రిపోర్ట్ రాగానే బాధితులకు తగిన పరిహారం అందజేస్తామన్నారు.

వర్షం, దుమ్ముతుఫాను కారణంగా ఢిల్లీలో ఇద్దరు చనిపోయారు. 18 మందికి గాయాలయ్యాయి. 109 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటంతో చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విజయ్ చౌక్, జన్ పథ్, ఇండియా గేట్, ఆర్కే పురం ప్రాంతాల్లో విపరీతమైన గాలులు వీచాయి. రోడ్ల మీద దుమ్మంతా ఇళ్లలోకి కొట్టుకొచ్చింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపైనా ప్రభావం పడింది. దాదాపు 70కి పైగా విమానాలను దారి మళ్లించారు. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో రైల్ సర్వీసులను కూడా కొద్దిసేపు నిలిపేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా గాలి దుమారం గట్టిగానే తగిలింది. ఆయన పాల్గొన్న సభలో టెంట్లు లేచిపోయాయి. సైడ్ వాల్స్ కొట్టుకుపోయాయి. దీంతో సభ ఆగిపోయింది.

దుమ్ముతుఫాను, వడగళ్ళవర్షం మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అధికారులు వేగంగా సహాయకచర్యలు చేపట్టాలని చెప్పారు మోడీ.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy