58 లక్షల చెక్కులు రెడీ : రైతుబంధుకు సర్వం సిద్ధం

RAITHU BANDHUరైతులకు ముందస్తుగా పెట్టుబడి సమకూర్చడానికి ప్రపంచంలోనే మొదటిసారిగా తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతుబంధు పథకం కింద రానున్న వానకాలం సీజన్‌ కు సంబంధించి.. మే పదో తేదీ నుంచి ప్రారంభించనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేసింది వ్యవసాయశాఖ. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు అవగాహన సదస్సులను వ్యవసాయశాఖ నిర్వహిస్తున్నది. ఈ పథకం కింద ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరానికి ఎనిమిదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. వానకాలం సీజన్‌ కు సంబంధించి మే 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎకరాకు రూ. నాలుగువేలు రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 1 కోటి 39 లక్ష71 వేల 568 ఎకరాలకు రూ.5,588.62 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనున్నారు. 58 లక్షల మంది రైతులకు ఈ చెక్కులను అందిస్తారు.

యాసంగి పంటకు నవంబర్ 18 నుంచి చెక్కులు

యాసంగి పంటల కోసం నవంబర్ 18 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ చేసేలా వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.12 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. రెవెన్యూశాఖ భూప్రక్షాళనలో పార్ట్ ఏ కింద 93 శాతం భూముల వివరాలిచ్చింది. వీటన్నింటికీ రైతుబంధు పథకం అమలు కాను న్నది. రైతుబంధు చెక్కులను, పాస్‌ పుస్తకాలతో కలిపి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చెక్కులు, పాస్ పుస్తకాలు మండలాలకు చేరాయి. వీటిని పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచారు. పంపిణీ కోసం ప్రతి మూడొందల మంది రైతులకు ఒక టీంను ఏర్పాటుచేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇబ్బందులు లేకుండా ఈ పంపిణీ కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర వ్యవసాయరంగంలో రైతుబంధు పథకం ఒక చారిత్రాత్మక మలుపుగా మారనుంది.

నల్లగొండ టాప్

రైతుల సంఖ్యలో, భూమి విస్తీర్ణంలో, ఎక్కువ పెట్టుబడి మొత్తాన్ని అందుకోవడంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో 4 లక్షల 38 వేల 589 మంది రైతులకు 11.65 లక్షల ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది. ఇందుకోసం రూ.466 కోట్ల పెట్టుబడిగా లభించనున్నది. జిల్లాలో సుమారు 6 వేల 119 మంది రైతులు రూ.50వేలకుపైగా పెట్టుబడి సాయం అందుకోనున్నారు. వీరికి రెండు చెక్కులు ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy