6 నెలల తర్వాత తెరిచిన కేదార్ నాథ్ దేవాలయం

oprఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ దేవాలయాన్ని భక్తుల దర్శనం కోసం తెరిచారు. ఆదివారం (ఏప్రిల్-29) ఉదయం ప్రత్యక పూజలు నిర్వహించి ఓపెన్ చేశారు. ఏడాదిలో ఈ ఆలయం ఆరు నెలలు మూసి ఉంచడం, ఆరు నెలలు తెరిచి ఉంచుతారు. భక్తుల సందర్శనార్థం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

 

చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని ఈ ఆరునెలల్లో లక్షల మంది సందర్శిస్తారు. మరోవైపు భక్తుల కోసం వైద్య, విద్యుత్ , నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ తెలిపారు. మళ్లీ నవంబర్ లో ఈ ఆలయం మూతపడనుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy