61 ఏళ్లనాటి షూకి 2 కోట్ల 74 లక్షల రూపాయలు

28E6E65700000578-0-image-m-58_1432131643916ఈ షూ కాస్ట్ 2 కోట్ల 74 లక్షల రూపాయలు… ఇంత పాత షూకి అంత ధరా.. అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండి.. వీటి రేంజ్ అంత మరీ. ఈ షూ ఈ కింద ఫొటోలో ఉన్న పెద్ద మనిషివి. వయస్సు 86 ఏళ్లు. ఈయన పేరు రోజర్ బానిస్టర్. ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ లలో ఒకరు. బ్రిటన్ కు చెందిన ఈయన 1950లలో క్రీడాప్రపంచాన్ని ఓ ఊపు ఊపేశాడు. ఇప్పటి తరానికి ఉసేన్ బోల్ట్ ఎలాగో… ఈయన అలా అన్నమాట. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే… ఈయన 1954లో జరిగిన ఓ ఈవెంట్ లో మైలు దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ క్రీడారంగాన్ని నివ్వెరపరిచాడు. అదిగో అప్పుడు ఉపయోగించినవే ఇవి. వీటిని వేలం వేయగా 2 కోట్ల 74 లక్షల రూపాయలు పలికాయి. రోజర్ మంచి అథ్లెట్ మాత్రమే కాదు… మంచి మనసున్న మారాజు కూడా. తన సంపాదనలో అధిక భాగాన్ని న్యూరోలాజికల్ రీసెర్చ్ లకు అందజేసేవారు. ఇప్పుడు ఈ వేలం డబ్బును కూడా ఆ పరిశోధనలకే అందచేస్తున్నారు. ఇవి అంత ఎక్కువ ధరకు వేలంపాటలో పోతాయని అస్సలు ఊహించలేదని సర్ ప్రైజ్ అవుతున్నారు రోజర్.  అయితే ఈ షూని కొన్న వ్యక్తి పేరు మాత్రం బయటపెట్టడం లేదు ఈ పెద్దమనిషి.

Roger Bannister2264

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy