62 బంతుల్లో 125 రన్స్: టీ20లో విండీస్ విధ్వంసం

ind-vs-wi-t202-10-1499649456వెస్టిండీస్ పర్యటనను ఓటమితో ముగించింది టీమ్ ఇండియా. కింగ్ స్టన్ లో ఆదివారం ( 09-07-17)న జరిగిన ఏకైక టీ20లో ఇండియా 9వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వన్డే సిరీస్ గెటిచిన జోరుతోనే టీ20 మ్యాచ్ ను కూడా కైవసం చేసుకుంటారని భావించిన కోహ్లి సేనకు.. ఎవిన్ లెవిన్ లూయిస్ ( 62 బంతుల్లో 125 నాటౌట్, 6 ఫోర్లు, 12 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో  చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన లూయిస్   విండీస్ కు ఘన విజయాన్ని అందించాడు.

 ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ కోహ్లీ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (35 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఓపెనర్లు కోహ్లీ, ధవన్ (23) 10 పరుగుల రన్‌రేట్ నమోదు చేసి భారీ స్కోరుకు పునాదులు వేశారు. కానీ ఆరో ఓవర్‌లో మూడు బంతుల తేడాతో ఈ ఇద్దరు ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో రిషబ్‌తో కలిసి దినేశ్ కార్తీక్ వీలైనంత వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. చకచకా ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌ప్లేలో 66 పరుగులు చేసిన భారత్‌కు తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 93 పరుగులకు చేరింది. బ్రాత్‌వైట్, శామ్యూల్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదిన కార్తీక్.. మూడో వికెట్‌కు 9.5 ఓవర్లలో86 పరుగులు జత చేసి వెనుదిరిగాడు. అప్పటికీ జట్టు స్కోరు 151/3. ఇక రెండొందలు ఖాయమనుకున్న తరుణంలో ఆతిథ్య బౌలర్లు మ్యాజిక్ చేశారు. కేవలం 9 బంతుల వ్యవధిలో ధోనీ (2), పంత్, కేదార్ (4)ను ఔట్ చేసి స్కోరుకు కళ్లెం వేశారు. చివర్లో జడేజా (13 నాటౌట్), అశ్విన్ (11 నాటౌట్) చెలరేగారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy