6,603 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో 6వేల 603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు అయ్యాయి. పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. గ్రామ పంచాయతీలు పెరడగం…వాటి నిర్వహణకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఈ పోస్టుల భర్తీపై చర్చించింది. మొత్తం పంచాయతీ కార్యదర్శి ల పోస్ట్ లు 9,355 ఉన్నాయి. ప్రస్తుతం 6,603  పోస్టులకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…మిగతా 2,755 పోస్ట్ లకు మరో సారి ఉత్తర్వులు ఇచ్చే అవకాశముంది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy