70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు మరో 15% అదనం

old70 ఏళ్లు దాటిన పింఛనుదారులకు 15 శాతం అదనపు పింఛను (క్వాంటమ్‌ పింఛను) ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.  పీఆర్సీ చేసిన సిఫారసును అమలు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది రాష్ట్రప్రభుత్వం. అయితే ఇతరత్రా అంశాలను కూడా పరిగణించాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌. తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల సంయుక్త కార్యాచరణ సమితి(టీజీపీజేఏసీ)తో గురువారం ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం 75 ఏళ్లు నిండిన పింఛనుదారులకు మాత్రమే క్వాంటమ్‌ పింఛను ఇస్తున్నారు.

 రాయితీ రేట్లకు  రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు

వెల్‌నెస్‌ సెంటర్లను జీహెచ్‌ఎంసీ పరిధిలో 10, మిగిలిన 30 జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను గృహవసతి లేని పింఛనుదారులకు రాయితీ ధరలకు అందించడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎస్‌. ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు రాయితీ ధరలకు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై ఆర్టీసీ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2.50 లక్షల మంది పింఛనుదారులుండగా 70 ఏళ్లు నిండిన వారు 75 వేల మంది వరకూ ఉన్నారు. వారికి అప్పట్లో తక్కువ వేతనాలున్నందున ఇప్పటికీ పింఛను తక్కువగానే వస్తోంది. ఇటీవల రిటైరైన ఉద్యోగులకు పింఛను సంతృప్తికరంగానే ఉంటోందని, అందుకే 70 ఏళ్లు నిండగానే పింఛన్‌ పెంచాలన్న డిమాండ్‌ సరైందేనని అభిప్రాయపడుతుంది సర్కార్. అమలు చేస్తే 70 ఏళ్లు నిండిన పింఛనుదారులకు 15 శాతం అదనపు పింఛను తొలిసారి ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy