74 స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ : తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పస్ట్ లిస్టును రిలీజ్ చేసింది కాంగ్రెస్. 74 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.  ఈ సందర్భంగా ఇవాళ (నవంబర్-08)న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్..మిగిలిన స్థానాలను నవంబర్-11న ప్రకటిస్తామని తెలిపింది. 74 సీట్లలో.. టీడీపీకీ -14, టీజేఎస్  కి- 8 , సీపిఐ -3 సీట్ల చొప్పున కేటాయించింది కాంగ్రెస్ ఎన్నికల కమిటి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 10న తెలుపుతామన్న కాంగ్రెస్..మిగతా 20 స్థానాలను నవంబర్- 11న అనౌన్స్ చేస్తామని తెలిపింది.

దీనిపై నవంబర్-11న ఉదయం  కాంగ్రెస్ ఎన్నికల కమిటి సమావేశం ఉంటుందని తెలిపారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా‌. గురువారం(నవంబర్-08) రాహుల్ నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం రెండు గంటలపాటు జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. 10న తొలి జాబితాను విడుదల చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy