78 ఏళ్ల బామ్మ.. ఫిట్ నెస్ లో ఫస్ట్

sss78 ఏళ్ల వయస్సులోనూ సునాయాసంగా ఆసనాలు వేస్తున్న ఈ పెద్దావిడ పేరు ఉషా సోమన్. ప్రముఖ ఫిట్ నెస్ గురు మిలింద్ సోమన్ తల్లి. వ్యాయామాల్లో కొడుకు మిలింద్ ఆరితేరితే..  ఆ కొడుకును మలిచిన తల్లిగా ఉషా కూడా అంతే పేరు సంపాదించారు. ఉమెన్స్ డే సందర్భంగా మిలింద్ ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్  లో పోస్టు చేశాడు. అది తన తల్లి.. ఉషా సోమన్ ప్లాంక్ చేస్తుండగా తీసిన వీడియో. ప్లాంక్ అనేది ఓ వ్యాయామ ప్రక్రియ. శరీరంలో కోర్ పవర్ ను పెంచడానికి ఇది చేస్తుంటారు. నేలపై సమాంతరంగా మోచేతులపై ఉండి.. మునివేళ్లపై భారం వేస్తూ.. ఉండటమే ప్లాంక్. ఇలా నిమిషంపైనే చేసి.. అందరితో ప్రశంసలు అందుకుంటోంది ఈ బామ్మ. మదర్స్ డే సందర్భంగా ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. చీరకట్టుతో బామ్మ… ఈ ఫీట్ చేయడంపై సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy