8 ఏళ్ల పిల్లాడు… సైబర్ సెక్యూరిటీపై లెక్చర్…

rubenఅతడి వయస్సు 8 ఏళ్ళు….సైబర్ సెక్యూరిటీ మీద కీలక ప్రసంగం చేయబోతున్నాడు. విదేశాంగమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీ.కే. సింగ్ తో పాటు అతను ఢిల్లీలో జరిగే సైబర్ సెక్యూరిటీ సదస్సులో కొత్త తరానికి సైబర్ సెక్యూరిటీ ఎందుకు అవసరమన్న విషయంపై లెక్చర్ ఇవ్వబోతున్నాడు. రూబెన్ పాల్ అనే ఈ పిల్లాడు… భారత సంతతికి చెందిన అమెరికా సిటిజెన్. పాల్ ఏడాదిన్నరనుంచి కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. తండ్రి మనో పాల్ అతనికి కంప్యూటర్ పాఠాలు నేర్పించాడు. మొదట్లో ‘సీ ప్రోగ్రాం’పై లెక్చర్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ‘ఐఓఎస్’ మీద స్క్రిప్ట్ ప్రోగ్రాంస్ నేర్పిస్తున్నాడు. ‘ఫ్రూడేంట్ గేమ్స్’ అనే గేమింగ్ సంస్థను ఈ ఆగస్ట్ లో రూబెన్ ప్రారంభించాడు. దీనికి అతనే సీఈఓ, తండ్రి కూడా ఆ కంపెనీలో పార్టనర్. సైబర్ సెక్యూరిటీ మీద రూబెన్ కి ఇది నాలుగో స్పీచ్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy