ట్రక్కు లోయలో పడి 11 మంది మృతి.. ఒడిశాలో ఘోర ప్రమాదం

మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా

కందమల్: ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడి 11 మంది మరణించారు. మంగళవారం ఉదయం బలిగూడ ప్రాంతంలోని పొయ్ గూడ ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు, ఇతర వాహనదారులు గాయపడిన వారిని బయటకు తీసి బెర్హంపూర్ ఆసుపత్రికి పంపారు.

రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా

ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స చేయిస్తామని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy