88 స్థానాల్లో టీఆర్ఎస్ భారీ విజయం


రాష్ట్ర రాసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ సమీప ప్రత్యర్థిపై 57,321 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ 89 వేల మెజార్టీతో గెలిచారు. సిద్దిపేట నుంచి హరీష్ రావు డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. మెజార్టీలోనూ అందరిని దాటిపోయారు. లక్షా 18 వేల 699 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మేడ్చల్ లో 88 వేల 66 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్ధి మల్లారెడ్డి గెలిచారు. ఉత్కంఠ పోరు సాగిన కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి.. సమీప ప్రత్యర్థి రేవంత్ రెడ్డిపై 10 వేల 770 ఓట్లతో గెలిచారు. అయితే.. టీఆర్ఎస్ లో కొందరు ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. భూపాలపల్లి నుంచి బరిలో ఉన్న స్పీకర్ మధుసూధనాచారి, పాలేరు లో తుమ్మల నాగేశ్వరరావు, ములుగులో చందూలాల్, కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, తాండూరులో మహేందర్ రెడ్డి ఓడిపోయారు. ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీతో కలిపి మొత్తం.. ఏడు స్థానాల్లో విజయం సాధించింది.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్ని ధీమాగా ఉన్న కాంగ్రెస్ కు ఫలితాలు షాకిచ్చాయి. కేవలం 21 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క వంటి కొందరు తప్ప చాలా మంది కీలక నేతలు ఓటమిపాలయ్యారు. ఉత్తమ్ 8 వేల 4 వందల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక.. కాంగ్రెస్ లో సీనియర్ నేతలు చాలామంది ఇంటిదారి పట్టక తప్పలేదు. జానారెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, గీతారెడ్డి, సంపత్ కుమార్, పొన్నం ప్రభాకర్. మల్లు రవి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు ఉన్న ఐదు సీట్లలో నాలుగు సీట్లు కోల్పోయింది బీజేపీ. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి కూడా తమ సీట్లు కోల్పోయారు. గోషామహల్ నుంచి పోటీ చేసిన రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. అక్కడ కూడా చివరి వరకు పోరు హోరాహోరీగా కొనసాగింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్, వైరాలో ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్ గెలిచారు.

జిల్లాల వారీగా చూస్తే.. హైదరాబాద్ ఏడు స్థానాల్లో టీఆర్ఎస్, ఏడు స్థానాల్లో ఎంఐఎం, ఒక స్థానంలో బీజేపీ గెలిచాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 9స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్ కు ఒక సీటు వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోటీఆర్ఎస్ 11 నియోజకవర్గాల్లో, ఒక స్థానంలో కాంగ్రెస్, ఒక నియోజకవర్గంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గెలిచారు. మెదక్ జిల్లాలో 9 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచాయి. రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆరు, కాంగ్రెస్ కు రెండు సీట్లు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచాయి. ఉమ్మడి నల్గొండలో టీఆర్ఎస్ 9 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 10 స్థానాలను కైవసం చేసుకోగా.. రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ ఖాతా తెరిచింది. రెండు స్థానాల్లో టీడీపీ, ఆరు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో టీఆర్ఎస్, ఒక స్థానంలో ఇండిపెండెంట్ విక్టరీ సాధించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy