9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇవాళ రాజ్యసభలో ప్రకటించారు చైర్మన్ వెంకయ్యనాయుడు. ఈ నెల 8 మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 9 ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించి డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.అయితే రాజ్యసభలో బీజేపీకి సరిపోయినంత మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. యూపీఏ ప్రభుత్వంలో డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన పీజే కురియన్ కు జూన్‌లో పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ పొందారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy