9 లక్షల బ్యాంక్ ఖాతాలపై ఐటీ నిఘా

income-tax-departmentనోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు చేసిన తొమ్మిది లక్షల మంది ఖాతాలు అనుమాస్పదం ఉన్నాయని ఐటీశాఖ తెలిపింది. మార్చి 31న స్వచ్ఛంద వెల్లడి పథకం పూర్తయిన తర్వాత ఆ ఖాతాదారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన కింద 18 లక్షల మందికి ఐటీశాఖ SMS లు.. ఈమెయిళ్లు పంపింది. పాతనోట్ల రద్దు తర్వాత వారు ఆధారాలు లేకుండా 5లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు డిపాజిట్లు చేశారని ఐటీ శాఖ వెల్లడించింది. డిపాజిట్ల మీద ఫిబ్రవరి 15 లోపు వివరణ ఇవ్వాలని అడిగామని చెప్పింది.

ఆదాయపన్ను రిటర్న్‌లో లెక్కచూపినంత మాత్రాన సరిపోదని.. 2016-17, ఆ ముందు సంవత్సరాల్లో ఆదాయంలో అసాధారణమైన పెరుగుదల ఉంటే ఆ డబ్బును బ్లాక్ మనీగా, వివరాలు లేని డబ్బుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా తమ దగ్గరున్న నల్లడబ్బులో 50 శాతం పన్ను, జరిమానా, సర్‌చార్జ్జీ చెల్లించి, మరో 25 శాతం డబ్బును నాలుగేండ్ల పాటు వడ్డీలేకుండా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి, వివరాలు బహిర్గతం చేయాల్సిందిగా కోరామని అధికారులు తెలిపారు.

ఆదాయపన్ను శాఖ నుంచి SMS లు అందుకున్న 18 లక్షల మందిలో తొమ్మిది లక్షల ఖాతాలు అనుమాస్పదంగా ఉన్నట్లు పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. 18 లక్షల మందిలో 5.27లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12 లోగా వివరాలు సమర్పించారని వెల్లడించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy