9-9-9 పాటిస్తే మీరే రిచ్

0తొమ్మిది లక్కీ నెంబర్.. కాదనేవారు తక్కువే..  ట్రిపుల్ నైన్  పద్ధతి పాటిస్తే ధనవంతులు కావచ్చొంటున్నారు వెల్త్ అడ్వజర్లు..  అమెరికాను ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కించేదుకు ప్రతిపాదించిన ట్రిపుల్ నైన్ స్కీంకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పాటించోచ్చుంటున్నారు వెల్త్ అడ్వైజర్లు.. ఈ  ట్రిపుల్ నైన్ సంగతేంటో  వెల్త్ మేనేజ్ మెంట్ చిట్కాలు చెప్పే ఇట్స్ యువర్ మనీలో  చూద్దాం..

అమెరికా ప్రెసిడెంట్  నామినేట్ చేసిన హెర్మెన్ కెయిన్.. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన  అమెరికాను గట్టిక్కించేందుకు నైన్.. నైన్.. నైన్ కాన్సెప్ట్ ను ప్రతిపాదించారు. ఇదేమిటంటే.. ఆదాయంలో తొమ్మిది శాతం ఇన్ కం ట్యాక్స్, తొమ్మిది శాతం బిజినెస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, తొమ్మిది శాతం ఫెడరల్ సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తే దేశం ఆర్దికంగా నిలదొక్కుంటుదనేది ఆయన సిద్దాంతం. అయితే ఈ స్కీం అమెరికాను గట్టెక్కించిందో లేదో.. తెలియదు కాని మనం మాత్రం  దీన్ని పాటిస్తే  రిచ్.. అయ్యేందుకు ఛాన్స్ ఉందని వెల్త్ అడ్వైజర్లు లెక్కలేసి మరీ చూపిస్తున్నారు.

ఈ ప్రోగ్రాంలో మూడు స్టేజ్ లున్నాయి. మొదటిదేమిటంటే… తొమ్మిది శాతం లేదా అంతకన్నా ఎక్కువ వడ్డీరేటు ఉన్న అప్పులను తీర్చేయడం.. ఇప్పడున్న వడ్డీ రేట్లు చూస్తే అన్నీ 9 శాతానికిపైగానే ఉన్నాయి కదా అని అనుకుంటున్నారా. నిజమే.. దీన్ని అంగీకరించక తప్పదు. సో..ఈ రూల్ ను కొద్దిగా సవరించుకుందాం. అదేమిటంటే మీరు అవసరాల కోసం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీ రేటు కన్నా మీరు లాంగ్ టర్మ్ కు చేసిన రిస్క్ ఫ్రీ పెట్టబడులపై  వచ్చే వడ్డీ రేటు ఎక్కుగా ఉంటే…  అ వడ్డీతో రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ భారాన్నీ తీర్చేయాలి.. లేదంటే ఇంట్రెస్ట్ లయబిలిటీ పెరుగుతుంది.

ఇక రెండో స్టేజి ఎంటో చూద్దాం…ప్రతి ఒక్కరికి.. వ్యక్తిగతంగా కావచ్చూ లేద కుంటుంబం కోసమైనా ..  నెల వారి ఖర్చులు ఉంటాయి. ఇందులో ఆహారానికి, ప్రయాణాలకు, ఇంటి రెంట్ కు, అవసరమైన బట్టల కొనుగోలుకు, పిల్లల చదువులకు.. ఇలా  తప్పనిసరి ఖర్చలు చాలానే ఉంటాయి. ఈ తప్పని సరి ఖర్చులు జాబితా రాసుకుని మొత్తం ఎంతో లెక్క వేసుకోవాలి. తొమ్మిది నెలలకుగాను కనీస అవరసరాలకయ్యే ఖర్చు ఎంతవుతుందో…  అంత మొత్తాన్ని సమకూర్చకునేందుకు ప్రణాళిక వేసుకోవాలి.  లగ్జరీ.. అనవసర లేదా వృథా ఖర్చలు పూర్తిగా తగ్గంచుకుని వాటి ద్వారా కొంత మొత్తాన్ని సమకూర్చూకోవాలి. మిగతదానికి కోసం మీ నెల వారి ఆదాయంలో కొంత మొత్తాన్ని ఈ స్కీంకు డైవర్ట్ చేయాలి.

ఇది మొదట్లో కొంచం ఇబ్బందికరంగా అనిపిస్తుంది.. అయితే ఒక సారి డబ్బులు సేవ్ చేయడం మొదలెడితే ఆ సంతృప్తి మిగతా మొత్తాన్ని సమకూర్చుకోవడానికి ఉత్సాహానిస్తుంది. తొమ్మిది నెలలకు సరిపడా ఖర్చులను సమకూర్చుకోవడం కష్టమనిపిస్తే…కనీసం రెండు మూడు నెలలకు సరిపడా మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నించాలి. తరువాత దీన్నీ తొమ్మిది నెలలకు పెంచండి. ఇలా సమకూర్చుకున్న మొత్తాన్ని సులభంగా తీసుకునే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కాని ఫిక్స్ డ్ డిపాజిట్లోనైన జమ చేయాలి.  దీన్ని చూపి మీ ఫ్రెండ్సో, పక్కింటి వారో మిమ్మల్ని పిసినారి అనీ లేదా చచ్చేటప్పుడు సంపాదన వెంటేసుకోపోతావా.. లైఫ్ ఎంజాయ్ చేయకపోతే కిక్కు ఏముంటందని ఎద్దేవా చేశావారుంటారు. వాళ్ల మాటలు పట్టించుకుని మీ స్కీంను విరమించుకోకండి. ఒక సారి మీ ట్రిపుల్ నైన్ స్కీం పూర్తయితే మిమిల్ని విమర్శించిన వాళ్లే మెచ్చుకోవడమేకాక మీ స్కీం రహస్యమేమిటో తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం ఖాయం. జీవితంలో మీరు ఎదుగుతున్న కొద్ది  ఈ సూత్రాన్ని పాటిస్తూ పోతే మీ ఇంటికో ఇతర అవసరాల కోసం తీసుకున్న రుణాలు సులభంగా చెల్లించేస్తారు.

ట్రిపుల్ నైన్ ప్రోగ్రామ్ లో మూడో టిప్ ఏమిటంటే.. మీ కనీసావసరాలకయ్యే ఖర్చలకు సరిపడా సేవింగ్స్  చేసిన తరువాత మీ వార్షిక సంపాదనలో కనీసం 9 శాతం డబ్బును  మీ రిటరైమెంట్ తరువాత అవసరాల కోసం సేవ్ చేయాలి.

ఉద్యోగమో, వ్యాపారమో.. చేస్తున్నప్పుడు సంపాదించేదంతా కుటుంబం కోసం ఖర్చుపెడాతం. అవసరమైతే రాత్రి పగలు కష్టపడతాము కాని వృద్థాప్యంలో అవసరమైన ఖర్చుల గురించి ఆలోచించే వారు తక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు మినహియిస్తే  మిగత వారు ఓల్డ్ ఏజ్ లో అవసరమయ్యే ఖర్చల కోసం కొడుకులపైనో, కూతుర్లపైనో ఆధారపడతారు. ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ సీన్  మనం రోజూ మన పక్కంట్లోనో ఎదురింట్లోనో చూస్తూనే ఉంటాం. దాన్ని మనకు అన్వయించుకోం.. ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం. భవష్యత్తులో చిన్న చిన్న అవసరాల కోసమైన కనీసం ఇప్పటి నుంచైనా సేవింగ్స్ మొదలుపెట్టాలి.  ఇందాక చెప్పుకున్నట్లు మన వార్షికాదాయంలో  తొమ్మిది శాతం చోప్పున సేవింగ్ చేయాలి. ఇది చాలా చిన్న మొత్తంగా కనిపించ వచ్చు కానీ 10, 15 సంవత్సరాల తరువాత జమ చేసిన మొత్తాన్ని  చూస్తే మనమే ఆశ్చర్యపడతాం. ఈ మొత్తాలను లాంగ్ టర్మ్ ఇన్వెస్టమెంట్ ప్లాన్సలో  నెల నెల పొదుపు చేస్తూ పోవాలి..

భవిష్యత్తు మీద భరోసా పెరిగితే మీ జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. ఈ ట్రిపుల్ నైన్ స్కీం పాటించడం కొంచెం కష్టమే అయినా పద్ధతి ప్రకారం డిసిప్లీన్ గా పాటిస్తే మీరు ధనవంతుల జాబితాలో చేరిపోవడం మాత్రం ఖాయం.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy