90 సెకన్లలో టేస్టీ ఫుడ్..దేశంలో తొలి ఆటోమేటెడ్ రెస్టారెంట్

Robo-Waiter-620x413

ఫాస్ట్ ఫుడ్ కంటే ఫాస్ట్ గా ఫుడ్ అందించే రెస్టారెంట్ వచ్చేసింది. ఆర్డర్ ఇస్తే 90 సెకన్లలో మనకి కావాల్సిన ఐటమ్ ను అందిస్తుంది. ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడ అనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నాం.

అత్చ్యాయమ్ ఫుడ్ బాక్స్ రెస్టారెంట్ ను చెన్నై నగరంలో అక్కడికి చెందిన సతీష్ అనే పారిశ్రామిక వేత్త ప్రారంభించారు. కస్టమర్లకు ఫాస్ట్ గా ఫుడ్ సర్వ్ చేయాలనే ఉద్ధ్యేశంతో ఆయన ఈ రెస్టారెంట్ తో ఓపెన్ చేసినట్లు ఆయన చెప్పారు. మనకి కావాల్సిన ఫుడ్ ని 90 సెకన్లలో అందిస్తుందని తెలుసుకున్న చెన్నైవాసులు నోరెళ్ళబెట్టుకున్నారు.

ఈ ఫుడ్ బాక్స్ రెస్టారెంట్ లో లైట్ టిఫెన్ నుంచి కాంబో మీల్స్ వరకూ ఏ ఐటమ్ అయినా 90 సెకన్లలో కస్టమర్ కు చేరుతుంది. ఇలాంటి రెస్టారెంట్ ను డిజైన్ చేయడానికి దాదాపు మూడేళ్ళు పట్టిందన్నారు సతీష్. దీన్ని మిగతా నగరాలకు విస్తరిస్తామని ఆయన అన్నారు.

కస్టమర్లు వాళ్ళకు కావాల్సిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ ను ఎంచుకోవచ్చు. ప్యాక్ చేసిన ఫుడ్ తాజాగా కస్టమర్లకు అందిస్తారు. క్రెడిట్, క్యాష్ రూపంలో మనీ చెల్లిస్తే చాలు.

చెన్నై నగరంలో ఉన్న కొన్ని రెస్టారెంట్లతో ఫుడ్ బాక్స్ ఒప్పందం చేసుకున్నాయన్నారు సంస్థ ప్రతినిధి సతీష్. ముందుగానే ప్యాక్ చేసినా ఐటమ్ తాజాగా ఉండే వాతావరణంలో ఉంచుతామని ఆయన అన్నారు.

ప్రస్తుతం చెన్నైలో రెండు ప్లేసుల్లో ఉన్న రెస్తారెంట్ ను 2015కల్లా దేశ వ్యాప్తంగా ఆరు రెస్టారెంట్లు ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు నిర్వాహకులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy