900 ఏళ్లు దుర్భర పరిస్థితి : సింధు నాగరికతను మింగిన కరువు

Indu sindu nagarikathaప్రపంచంలో గొప్ప నాగరికతల్లో ఒకటిగా విరాజిల్లిన సింధు నాగరికత ఎలా అంతరించిపోయిందో ఇప్పటికీ పెద్ద చిక్కు ప్రశ్నే. దీనిపై రకరకాల వాదనలున్నా.. అత్యధికశాతం మంది పరిశోధకులు 200 సంవత్సరాల పాటు వరుసగా కరువు పరిస్థితులు నెలకొనడం వల్లే సింధు నాగరికత అంతరించిందని చెబుతున్నారు. ఖరగ్‌ పూర్ ఐఐటీ పరిశోధకుల అధ్యయనం కరువు సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూర్చుతున్నది. సింధులోయ ప్రాంతంలో తొమ్మిది వందల పాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, నదులు ఎండిపోయే ప్రమాదం నెలకొన్నదని చెప్పారు. దీంతో సింధు ప్రజలు 4 వేల 350 సంవత్సరాల కిందట ఆ ప్రాంతాన్ని వదిలి గంగ-యమున పరీవాహక ప్రాంతానికి వలస వెళ్లారని చెబుతున్నారు. IIT ఖరగ్‌పూర్‌ లోని భూగర్భ, భూ భౌతిక శాస్త్ర విభాగాలకు చెందిన పరిశోధకులు హిమాలయ వాయువ్య ప్రాంతంలో గత ఐదు వేల సంవత్సరాల్లో రుతుపవనాల వైవిధ్యంపై పరిశోధన జరిపారు. లేహ్-లడఖ్ ప్రాంతాల మధ్యలో ఉన్న సో మిరిరి సరస్సుపై అధ్యయనం చేశారు. సరస్సులోని మృత్తిక పొరలను తవ్వి నమూనాలను పరీక్షించారు.

ఒక్కో పొరలో లభ్యమైన మూలకాల ఆధారంగా సింధులోయలో రుతుపవనాలు, శీతోష్ణస్థితి పట్టికను రూపొందించారు. సింధులోయలో క్రీ.పూ 2 వేల350 నుంచి క్రీ.పూ 1 వెయ్యి 450 వరకు వరుసగా 900 ఏండ్లపాటు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని గుర్తించారు. దీంతో నదులు పూర్తిగా ఎండిపోయి, వాటిపై ఆధారపడిన ప్రజలకు ఆహార కొరత ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల్లోని నదుల వెంట స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు రీసెర్చ్ టీమ్ మెంబర్ అనిల్ కుమార్ గుప్తా.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy