900 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఓ మహిళ

Louise_Richardsonఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ… ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం. 900 ఏళ్ల చరిత్ర దీని సొంతం. అలాంటి యూనివర్సిటీకి ఓ మహిళ తొలిసారి వైస్ చాన్సలర్ గా పదవీ బాధ్యతలు చేపట్టనుంది. 56 ఏళ్ల లూయిస్ రిచర్డ్ సన్ ఈ ఘనత సాధించారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత అంశాల్లో ప్రపంచంలోనే పట్టున్న వ్యక్తిగా ఆమెకు పేరు. వివిధ దేశాల్లో చట్టసభల సభ్యులకు ఈ అంశాలపై శిక్షణ ఇస్తుంటారంటే.. ఆమె ప్రత్యేకత ఏంటో సులభంగా అర్థమవుతుంది. ఈ నెల 1న ఆమె ఆక్స్ ఫర్డ్ వీసీగా నియమితులయ్యారు. అయితే ఈ నెల 12న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీని 1096లో స్థాపించారు. ఇంగ్లాండ్ లో ఉన్న ఈ యూనివర్సిటీలో 25వేలకు పైనే విద్యార్థులున్నారు. మొత్తం 27 మంది నోబెల్ అవార్డు గ్రహీతలను, 26 మంది ప్రధానులను అందించింది. ఇంగ్లాండ్ ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా ఈ యూనివర్సిటీ విద్యార్థే.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy