గురుకుల స్కూళ్లలో 960 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

te

తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ సోసైటీ విద్యా సంస్థల్లో 960 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో జూనియర్ లెక్చరర్ పోస్టులు- 360, పీజీటీ పోస్టులు- 103, టీజీటీలు- 206, ఫిజికల్ డైరక్టర్ లు- 51, డిగ్రి కాలేజీ లెక్చరర్ లు -240 పోస్టులను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.

తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ లో 73 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులు 41 , జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులు 32 పోస్టులను TSPSC ద్వారా భర్తీచేయనున్నారు.  ఎస్సీ డెవలప్ మెంట్ డైరెక్టరేట్ లో  జూనియర్ అసిస్టెంట్స్ 17 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ లు 11, అనాధ నిలయంలో  జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు 2 పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు.

చెక్కర పరిశ్రమ శాఖలో 06 పోస్టులను tspsc ద్వారా భర్తీ చేసేందుకు ఉత్తర్వులిచ్చింది సర్కార్. కో ఆపరేటివ్ సోసైటీలో కూడా 3 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుతినిచ్చింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy