99 ఏళ్ల తర్వాత..75 నిమిషాలు : కనువిందుచేసిన సంపూర్ణ సూర్యగ్రహణం

solar-eclipse-reuters_650x400_5150333712699 ఏళ్ల తర్వాత అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందుచేసింది.  ఈ గ్రహణం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంపూర్ణంగా కనిపించింది. అమెరికాలో ప్రధానంగా 14 రాష్ట్రాల మీదుగా 70.కి.మీ వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది.  వాయవ్య రాష్ర్టమైన ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో మొట్టమొదటగా సంపూర్ణ గ్రహణం ఆవిష్కృతమైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.05కు (భారత కాలమానం ప్రకారం రాత్రి 9.35కు) గ్రహణం మొదలైంది. సుమారు 75 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.

మెల్లమెల్లగా గ్రహణఛాయ తూర్పు దిశగా కదులడం మొదలుపెట్టింది. ఇదాహో, వ్యోమింగ్, నెబ్రాస్కా, మిస్సోరీ, ఇల్లినాయిస్, కాన్సస్, కెంటకీ, టెన్నెస్సీ, నార్త్ కరోలినా, జార్జియా రాష్ర్టాల గుండా గ్రహణం ముందుకు సాగింది. చివరకు సౌత్ కరోలినా రాష్ట్రంలో తీరం దాటింది. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది ఖగోళ శాస్త్రవేత్తలు తరలివచ్చారు. 99 ఏళ్ల తర్వాత అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడడంతో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఖగోళ అద్భుతాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావంతో ప్రస్తుతం అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉన్న హరికేన్‌  తీవ్రత తగ్గునుందని విశాఖకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త నలవాగుల మనోజ్‌ వెల్లడించారు.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy