AAP దెబ్బ Congress కే , BJP కి కాదు: Credit Suisse

cred

ప్రఖ్యాత ప్రపంచ స్థాయి ఆర్ధిక వ్యవహారాల సంస్థ ‘క్రెడిట్ స్విస్’ వారు ఆమ్ ఆద్మీ పార్టీ BJP కన్నా కాంగ్రెస్ అవకాశాలనే ఎక్కువ దెబ్బతీయవచ్చని అంటున్నారు. అవినీతి వ్యతిరేక, సమర్ధ, జవాబుదారీ పాలన ఎజెండాతో ఇప్పటికే సంచలనం సృష్టించిన AAP దాదాపు అదే ఎజండా ఉన్న BJP వోట్లను చీల్చే అవకాశాలే ఎక్కువ అని ఇప్పటిదాకా విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. కానీ ప్రాంత, భాషా, కుల, మత పరమైన అంశాలు బాగా ప్రభావం చూపే భారత్ లో కాంగ్రెస్, AAP ల మధ్యే ఎక్కువ పోలికలు ఉంటాయని అందువల్ల AAP కాంగ్రెస్ వోట్లను చీల్చే అవకాశమే ఎక్కువని, తత్ఫలితంగా BJP లాభపడే అవకాశం ఉంటుందని ఈ సంస్థ అంచనా.

2013 లో జరిగిన ఎన్నికల వోటింగ్ సరళి ని చూస్తే సంఖ్య లోనో, శాతంలోనో కాంగ్రెస్సే లాభపడిందని, కాంగ్రెస్  కానీ, BJP కానీ వద్దనుకునే వాళ్ళు అందరూ AAP వైపు వెళ్ళడం వల్లనే ధిల్లీ పీఠంపై ఆప్ కూర్చుందని క్రెడిట్ స్విస్ విశ్లేషించింది. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, BJP వ్యతిరేక వోటు ఎక్కువగా AAP ఉన్న చోటల్లా ఆ పార్టీకే దక్కుతుందని, దానివల్ల అంతిమంగా BJP అవకాశాలే మెరుగవుతాయని ఈ సంస్థ తేల్చి చెప్పింది. AAP ఐదు శాతం వోట్లు సాధించ గలిగినా సుమారు 40 సీట్లు కాంగ్రెస్ కోల్పోవచ్చని లెక్క వేసింది.

AAP వచ్చే కొద్ది రోజుల్లో చూపించే పాలనా పటిమ కూడా ఈ విషయాలను ప్రభావితం చేయవచ్చు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy