రోజు మొదలయ్యేది, ముగిసేది నీ ప్రేమతోనే : ప్రణయ్ పై అమృత స్పందన

మిర్యాలగూడ: ఆ జంటను చూస్తే ముచ్చటేస్తుంది. అబ్బా ఎంత బాగున్నారో అనిపిస్తుంది. అందమైన అమృత… ప్రణయ్ జంట అది. చిలకా గోరింక… ప్రేమ పక్షులు… మేడ్ ఫర్ ఈచ్ అదర్.. లాంటి పోలికలన్నీ    ఆ జంట తర్వాతే.

ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. కులాలు వేరైనా… స్నేహం, ప్రేమ వారిని ఒక్కటి చేసింది. నాన్న, బాబాయ్ వారిని విడదీయాలని చూసినా అమ్మాయి ప్రేమలో వెనకుడుగు వేయలేదు. ప్రణయ్ ను మరిచిపోవాలని బెదిరించినా..  ప్రేమికుడితో కలిసి జీవించాలని పట్టుదల చూపింది. ఆ పట్టుదలే వారి ప్రేమను నిలబెట్టింది. పెళ్లి బంధంతో ఒక్కటయ్యాక వారి అనుబంధం మరింత బలపడింది. అనుక్షణం ప్రణయ్ పేరునే అమృత శ్వాసించింది. అంత గాఢంగా ప్రేమించింది కాబట్టే.. ప్రణయ్ లేని జీవితాన్ని ఊహించలేకపోయింది. నాన్న బెదిరింపులను కాదని.. హైదరాబాద్ ఆర్యసమాజ్ లో ప్రణయ్ ను పెళ్లిచేసుకుంది. ప్రణయ్ తో తన బంధాన్ని, పంచుకుంటున్న ప్రేమను అమృత్ ఫేస్ బుక్ పోస్టుల్లో తెలిపింది.

“నాకు ప్రేమంటే తెలిసిందంటే అది నీవల్లే. నీ చిరునవ్వు చూశాకే నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. నేను జీవించే ప్రతి రోజు పర్ఫెక్ట్ గా ఉందనిపిస్తోంది. ఎందుకంటే నిన్ను ప్రేమించడంతోనే నా రోజు మొదలవుతుంది… నిన్ను ప్రేమిస్తూనే నా రోజు ముగుస్తుంది ” అని తమ మధ్య ఉన్న ప్రేమను అమృత వివరించింది.

అంతేకాదు.. మరో సందర్భంలో తనలో ప్రణయ్ పై ఉన్న చచ్చేంత ప్రేమ ఉంది అనే విషయాన్ని ఒక్కమాటలో తెలిపింది అమృత. ఆ ఒక్క పోస్ట్ చాలు… అమృతకు ప్రణయ్ పై ఎంత ప్రేమ ఉందోచెప్పడానికి. “నిజమైన ప్రేమకు.. జీవితాంతం ఒక్కరే భాగస్వామి కోరుకునేవి కేవలం హంసలు మాత్రమే. 99శాతం హంసలు మాత్రమే కడవరకు ఒక్క భాగస్వామితోనే జీవిస్తాయి. ఒకవేళ తమ జీవితభాగస్వామి చనిపోతే గుండె బద్దలై అవి కూడా ప్రాణం విడుస్తాయి. ప్యూర్ లవ్ రిలేషన్ అంటే ఇలాగే ఉంటుంది” అని అమృత అభిప్రాయపడింది. ప్రణయ్ పై అమృత ఎంత ప్రేమ చూపించిందో అని చెప్పడానికి ఈ మాటలు చాలు. పెళ్లి తర్వాత తీయించిన ఈ పోస్ట్ వెడ్డింగ్ చూస్తే.. ఆ జంట ఎంత చూడముచ్చటగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

#forever #memories #postwedding teaser… 💕💖

Amrutha Pranay 发布于 2018 年 8 月 17 日 周五

 

 

One Response to రోజు మొదలయ్యేది, ముగిసేది నీ ప్రేమతోనే : ప్రణయ్ పై అమృత స్పందన

  1. Anonymous says:

    Made for each other la vunnaru

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy