AMU వివాదం : మహేంద్ర ప్రతాప్ విశ్వవిద్యాలయగా పేరు మార్చాలని డిమాండ్

AMUఅలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ(AMU)కి పేరు మార్చి జాట్ కింగ్ రాజా మహేంద్ర ప్రతాప్ పేరు పెట్టాలని కొత్త డిమాండ్ తైరపైకి తెచ్చారు హర్యానా ఫైనాన్స్ మినిస్టర్ కెప్టెన్ అభిమన్యు. ఓ వైపు గతకొన్ని రోజులుగా యూనివర్శిటీ చుట్టూ వివాదాలు నెలకొన్న సమయంలో కొత్త వివాదానికి తెరదీశారు అభిమన్యు. భారతదేశాన్ని ముక్కలుగా చేసిన వ్యక్తి ఫోటో యూనివర్శిటీ లోపల ఉందని, రాజా మహేంద్ర ప్రతాప్ ఫోటో మాత్రం యూనివర్శిటీలో లేదని అభిమన్యు అన్నారు. ఆదివారం AMU దగ్గర జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అభిమన్యు  వెంటనే AMU పేరుని రాజా మహేంద్ర ప్రతాప్ విశ్వవిద్యాలయగా మార్చాలని డిమాండ్ చేశారు.

ఈ నెల మొదట్లో పాకిస్ధాన్ ఫౌండర్ మహమ్మద్ అలీ జిన్నా ఫోటోను AMU స్టూడెంట్ యూనియన్ ఆఫీసు నుంచి తొలగించాలంటూ కొన్ని గ్రూపులు ఆందోళన చేశాయి.అలీఘడ్ బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ స్టూగెంట్ యూనియన్ ఆఫీసులో జిన్నా ఫోటో ఉండటంపై ప్రశ్నించడంతో ఈ వివాదం రేగింది. అయితే దీనిపై స్పందించిన AMU వైస్- ఛాన్సలర్  తారిఖ్ మన్సూర్ జిన్నా ఫోటో వివాదం ఓ నాన్ ఇష్యూగా అభివర్ణించారు. జిన్నా ఫోటో 1938 నుంచి యూనివర్శిటీలో ఉందని తెలిపారు. ఇప్పటివరకూ ఎవరూ దీనికి అభ్యంతరం చెప్పలేదన్నారు. గుజరాత్ సబర్మతీ ఆశ్రమంలో, బాంబే హైకోర్టులో జిన్నా ఫోటో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. యూనివర్శిటిలో విద్యార్ధుల ఆందోళనకు జిన్నా ఫోటో వివాదంతో ఎటువంటి సంబంధం లేదన్నారు. AMUలో అలజడులు సృష్టించేందుకు బయట నుంచి వచ్చిన వారికి వ్యతిరేకంగానే మే-2 న విద్యార్ధులు ఆందోళన చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై చీఫ్ సెక్రటరీతో మాట్లాడి జ్యూడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాల్సిందిగా కోరారు. ఈ గొడవల కారణంగా యూనివర్శిటీలో మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ ఈవెంట్ రద్దు అయినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy