వైష్ణవ్ తేజ్.. ఇండస్ట్రీలోకి మరో మెగాహీరో

హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెలుగు సినిమాకి ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ రోజు వైష్ణ‌వ్ తేజ్ మూవీని గ్రాండ్‌ గా లాంచ్ చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు.

ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించగా.. అల్లు అర్జున్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితరులు స్క్రిప్ట్‌ ను అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ పై రూపొందనున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్. సుకుమార్ స్టోరీ అందిస్తుండగా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. వైష్ణవ్ తేజ్ గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ లో పేషెంట్ గా నటించాడు. జానీ సినిమాలో చిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గా న‌టించాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది యూనిట్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy