- రూ.5.8 లక్షల కోట్లలో రూ.4.5 లక్షల కోట్లు మింగేసేవారు

గడిచిన నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం రూ.5.78 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు చేరవేశామన్నారు. అవినీతికి అవకాశం లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లలోనే ఆ డబ్బు డిపాజిట్ చేశామని మోడీ తెలిపారు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే ఈ నాలుగున్నరేళ్లలో రూ.5.8 లక్షల కోట్లలో రూ.4.5 లక్షల కోట్లు మింగేసేవారన్నారు.
ఎన్నారైలు ఇండియా బ్రాండ్ అంబాసిడర్లు
ప్రవాస భారతీయులు మన దేశ బ్రాండ్ అంబాసిడర్లని, ఇండియా సత్తాకు సింబల్స్ అని మోడీ అన్నారు. మారిషస్, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఎన్నారైలు నాయకులుగా ఎదిగారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియా ఎంబసీలు, కాన్సులేట్లు పాస్ పోర్టు సేవా ప్రాజెక్టుతో కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నారు. అన్ని చోట్ల పాస్ పోర్టు సేవల కోసం సెంట్రల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో చిప్ బేస్డ్ ఈ-పాస్ పోర్టులను అందుబాటులోకి తెస్తామన్నారు. పలు ప్రాజెక్టుల్లో మొత్తం ప్రపంచాన్నే లీడ్ చేసే స్థాయి భారత్ చేరుకుందని మోడీ చెప్పారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రాజెక్టు ద్వారా‘వన్ వరల్డ్.. వన్ సన్.. వన్ గ్రిడ్’ దిశగా ప్రపంచాన్ని మనం నడిపిస్తున్నామని ఆయన వివరించారు.