నెక్స్ట్ సీక్వెల్…  అండర్ వాటర్ లో అవతార్

 2009లో రిలీజ్ అయి ప్రపంచ సినీ ప్రేమికులను ఆకట్టుకున్న చిత్రం అవతార్. ఈ చిత్రాన్ని సరికొత్త టెక్నాలజీతో దర్శకుడు జేమ్స్‌ కెమెరూన్‌ రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది 2.8 బిలియన్‌ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అవతార్ యొక్క నాలుగు సీక్వెల్స్ ను తెరకెక్కించినట్టు తెలుస్తుంది.  అవతార్ 3, 4 లు 50 శాతం షూటింగ్ జరుపుకున్నాయని… అవతార్ 2  మాత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు దర్శకుడు జేమ్స్‌ కెమెరూన్‌ తెలిపారు.

ఇప్పటివరకూ తెలిసిన వివరాల ప్రకారం రెండో భాగానికి ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’, మూడో భాగానికి ‘అవతార్‌: ది సీడ్‌ బేయరిర్‌, నాలుగో భాగానికి ‘అవతార్‌: ది టల్కన్‌ రైడర్‌, ఐదో భాగానికి ‘అవతార్‌: ది క్వస్ట్‌ ఫర్‌ ఈవా’ అనే టైటిల్‌ పెడుతున్నారు.

అవతార్ 2 ను రూపొందించడానికి ప్రత్యేకమైన సాప్ట్ వేర్ ను తయారు చేశామని జేమ్స్‌ కెమెరూన్‌ తెలిపారు. ఈ సినిమాలో టైటానిక్ ఫేమ్ కేట్‌ విన్స్‌లెట్‌ సముద్ర తీరప్రాంతం లో నివసించే వారికి నాయకురాలిగా కనిపించనుంది. అవతార్ 2 కథ మొత్తం సముద్ర ప్రాంతంలోనే జరగనున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy