మా ఊరే రాజధాని

vijawadaవిభజన తేలిపోయింది. ఇక సీమాంధ్ర రాజధాని ఎక్కడన్నదే ప్రశ్న. బిల్లు ఫైనల్ అయ్యాక 45 రోజుల్లో తేల్చేస్తామన్న కేంద్రం తర్వాత మార్పుల్లో గడువును ఆర్నెల్లకు పెంచింది. మరోవైపు కొత్త రాజధాని ఎక్కడనే దానిపై సీమాంధ్ర జిల్లాల్లో చర్చ జరుగుతోంది. బెజవాడలో ఉద్యమ సంఘాలు ఓ అడుగు ముందుకేశాయి. అన్ని వసతులున్న విజయవాడ –గుంటూరు మధ్య కొత్త రాజధాని నిర్మించాలని ఉద్యమబాట పట్టాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ కు రాజధానికి అయ్యే అన్ని హంగులూ విజయవాడ-గుంటూరు మధ్య ఉన్నాయని వాళ్లుంటున్నారు. ఎయిర్ పోర్ట్, రైల్వే జంక్షన్, సముద్రమార్గం, విశాలమై రోడ్లు ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి బెజవాడ-గుంటూరు మధ్య కావాల్సినంత ప్రభుత్వ భూమి కూడా ఉంది. అందుకే ఇక్కడ క్యాపిటల్ కట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇక్కడ రాజధాని నిర్మిస్తే ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమకు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. నెలాఖరులోగా విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రాజధానిపై బలంగా గళం వినిపించడానికి బెజవాడ నాయకులు సిద్ధమవుతున్నారు. వీళ్ల వాదనకు తగ్గట్టే విభజన బిల్లు మార్పుల్లో బెజవాడ-గుంటూరు-తెలంగాణ మధ్య అర్బన్ డెవలప్ మెంట్ రీజియన్ కు మెట్రో రైలు ప్రకటించడం విశేషం. ఇక విశాఖ, కర్నూలు నగరాల్లో కూడా రాజధాని వాదనలు వినిపిస్తున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy