BJP అసలు ఏమనుకుంటుంది?

ssjసీమాంధ్ర ప్రయోజనాలను రక్షించకపోతే బిల్లును వ్యతిరేకించడానికి వెనుకాడమని వెంకయ్య నాయుడు జైరాం రమేష్ కు తేల్చి చెప్పారని సీమాంధ్ర మీడియా రాత్రినుండి ప్రచారం చేస్తుంది. అలాగే సుష్మా స్వరాజ్ ను తెలంగాణాపై బేషరతు మద్దతు ప్రకటించకూడదని భాజపా జాతీయ నాయకత్వం కట్టడి చేసిందని కూడా ప్రచారాలు సాగుతున్నాయి. భాజపా, తెదేపా ల పొత్తు ఖరారు అయిందని, బాబు ఆ పార్టీని ప్రభావితం చేసే అవకాశాలు చాలా ఉన్నాయని కూడా వార్తలు ఉన్నాయి.

కానీ సుష్మా తన తెలంగాణా సమర్దనను ఏ మాత్రం తగ్గించుకోలేదని తెలుస్తుంది. సుష్మా స్వరాజ్ నిన్న తనను కలవడానికి వచ్చిన బాబు, నామా, జగన్ లను తెలంగాణా పై వారి వైఖరిని గట్టిగా ప్రశ్నించారని, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నట్లు తెలుస్తుంది. తెలంగాణా కు మద్దతు ప్రకటిస్తూ 2008 లో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని చెప్పిన బాబును “మరి ఇరు ప్రాంతాలకు సమన్యాయం అనే గందర గోళం మాటలతో ప్రక్రియను ఎందుకు ఆపమంటున్నారు? సీమాంధ్ర పక్షాన మాట్లాడాలంటే ఆ ప్రాంతానికి ఎం కావాలో అడగవచ్చు కదా…?” అని ప్రశ్నించారట. అలాగే జగన్ తో “తెలంగాణా గురించి మీరు మాకు కొత్త విషయాలేం చెప్పలేరు, మా వైఖరి మీరు చెప్పే విషయాల వల్ల మారేది కాదు, అసాధ్యమైన కోరికలు మాని మీరు స్పష్టంగా ఉండండి” అన్నట్లు తెలుస్తుంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy