ఒంటరిగా వెడ్డింగ్ ఫొటోషూట్.. కళ్లు చెమర్చే ప్రేమ కథ

ఇండియానా :  వెడ్డింగ్ ఫొటో షూట్ అంటే ఓ చక్కని జంట ఉంటుంది. ఇద్దరిమధ్య ప్రేమానురాగం కనపడే చూడముచ్చటైన స్టిల్స్ ఉంటాయి. కానీ.. ఈ ఆల్బమ్ వేరు. ఈ వెడ్డింగ్ ఫొటో షూట్ లో ఉన్నది ఒక్కరే. ఆమె ఒక్కతే. అతడు లేడు. ప్రాణంగా ప్రేమించిన ప్రేమికుడు.. పెళ్లికి ముందే చనిపోయాడు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ చేసిన రోజున… ఆమె ఒక్కతే ఇలా అతడి సమాధి సాక్షిగా వెడ్డింగ్ ఫొటోషూట్ లో పాల్గొంది. మనసైన వాడికి గుండెలనిండా గుర్తుచేసుకుని.. కన్నీటి కానుకలు, నివాళులు ఇచ్చింది.

ఈ సంఘటన యూఎస్ఏ లోని ఇండియానాలో జరిగింది. ఆమె పేరు జెస్సికా పాడ్గెట్. వయసు 25. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ గా ఉద్యోగం చేస్తోంది. అతడి పేరు కెండల్ ముర్ఫీ. వయసు 27. అతడో ఫైర్ ఫైటర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. లవ్.. కెరీర్ పై క్లారిటీతో ఉన్న ఈ ఇద్దరూ… ఈ ఏడాది సెప్టెంబర్ 29న పెళ్లిచేసుకోవాలని ఏడాది కిందటే అనుకున్నారు. ఐతే… గతేడాది నవంబర్ పదోతేదీన అనుకోని ఓ ప్రమాదంలో కెండల్ ముర్ఫీ చనిపోయాడు. తప్పతాగిన ఓ డ్రైవర్ కారును ర్యాష్ గా నడపడంతో జరిగిన ప్రమాదంలో కెండల్ ముర్ఫీ చనిపోయాడు.

పెళ్లికి ముందే.. ప్రియుడు చనిపోవడంతో.. ఆ జ్ఞాపకాల్లోనే ఉంటూ వస్తోంది జెస్సికా. భౌతికంగా కెండల్ లేకపోయినా…. తానే తన భర్త అనుకుంది. అనుకున్న సమయానికే తమ మ్యారేజ్ జరిగి తీరాలని నిర్ణయానికొచ్చింది. కెండల్ కు సంబంధించిన అక్కడి ఫైర్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన నివాళి కార్యక్రమాల్లో పాల్గొంది. వెడ్డింగ్ డే నిర్ణయించిన తేదీన ఒంటరిగా పెళ్లికి సిద్ధమైంది. అచ్చం పెళ్లికూతురులా ముస్తాబైంది. అక్కడి సంప్రదాయ ప్రకారం వైట్ గౌన్ ధరించి కెండల్ సమాధి దగ్గరకు చేరుకుంది. జెస్సికా పిలవడంతో.. తన పేరెంట్స్… కెండల్ ముర్ఫీ పేరెంట్స్, బంధువులు కూడా వచ్చారు. ఒంటరిగా పెళ్లికూతురైన అమ్మాయిని చూసి.. బాధను దిగమింగుకోలేకపోయారు వాళ్లంతా.

కెండల్ ముర్ఫీ సమాధిపై పువ్వులు ఉంచి సమాధిని కౌగిలించుకుంది జెస్సీకా పాడ్గెట్. అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఐనవాళ్లంతా కూడా సమాధి దగ్గర ఆమెను ఓదారుస్తూ బాధపడ్డారు. ఆ తర్వాత… పెళ్లిని జ్ఞాపకంగా మార్చుకోవాలనుకున్న జెస్సికాకు… కెండల్ ఎప్పుడూ ధరించే యూనిఫామ్, హెల్మెట్, అతడి షూస్ అందించింది అతడి తల్లి. వాటిని అందుకున్న జెస్సికా.. వెడ్డింగ్ పూలను ఆ షూస్ లో పెట్టింది. “నువ్వు ఏ దారిలో ఉన్నా.. నేను నీతోనే ఉంటా” అన్న మెసేజ్ కార్డ్ ను వాటిపై ఉంచింది జెస్సికా.

జెస్సికా పాడ్గెట్ కోరడంతో… “లవింగ్ లైఫ్ ఫొటోగ్రఫీ” నడుపుతున్న మండీ నెప్ అనే లేడీ ఫొటోగ్రాఫర్ … ఈ వెడ్డింగ్ ఫొటోలు తీసింది. ఓ అందమైన ప్రేమకథను తన ఫొటోల్లో నింపి.. ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ప్రేమలోని గాఢతను తెలిపే ఈ వెడ్డింగ్ షూట్ తన జీవితంలోనే మరువలేనిదని తెలిపింది. ఆరోజు తమ అందరికీ “ఓ ఎమోషనల్ రోలర్ కాస్టర్”లా అనిపించిందని వివరించింది.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy