BSNL దిపావళీ ఆఫర్: రూపాయితో వైరస్‌కు చెక్

bsnlప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు.. హ్యాకింగ్, వైరస్‌లు, స్పామింగ్‌ల బారిన పడకుండా కేవలం రూపాయికే సేవలు అందించనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘ఎక్స్‌జెన్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌’ పేరుతో ఈ ఇ-మెయిల్‌ సేవలను రోజుకు రూపాయికే అందించనుంది. ఏడాదికోసారి మాత్రమే చెల్లింపులు ఉంటాయి. రూ. 365 చెల్లిస్తే 1GB సేవలను, రూ.999 చెల్లిస్తే 10GB సేవలను ఏడాది మొత్తం పొందవచ్చు.

జైపూర్‌కు చెందిన డేటా ఇన్ఫోసిస్‌ అనే కార్పొరేట్‌ ఇ-మెయిల్‌ సర్వీస్‌ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న BSNL ..ఈ ఆఫర్‌ను కేవలం తమ వినియోదారులకే అందిస్తోంది. ‘వైరస్‌కు, హ్యాకింగ్‌కు, స్పామింగ్‌కు ఎక్స్‌జెన్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌తోచెక్‌ పెట్టండి అంటూ ట్విట్టర్‌లో తెలిపింది.

BSNL ఇ-మెయిల్‌ సర్వీస్‌కి మొబైల్‌ యాప్‌ కూడా ఉంది. కార్పొరేట్‌, పర్సనల్‌ సబ్‌స్క్రైబర్లు ఈ యాప్‌ ద్వారా సేవల్ని వినియోగించుకోవచ్చు.కొత్త ఇ-మెయిల్‌ ప్లాట్‌ఫాం ద్వారా గ్రూప్‌ మెయిల్స్‌, షెడ్యూలింగ్‌ మెయిల్స్‌ పంపుకునే సౌకర్యం కూడా కూడా ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy