BSNL రాఖీ స్పెషల్ ఆఫర్

imagesరాఖీ పండుగ స్పెషల్ గా BSNL  కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ రాఖీ పే సౌగాత్ ఆఫర్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. రూ. 74తో కాంబో వోచర్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 1GB డేటా ఉచితంగా అందుకోవడంతో పాటు BSNL నెట్‌వర్క్‌కు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. BSNL నుంచి మరో నెట్ వర్క్ కు రూ.74 టాక్‌టైం లభిస్తుంది. ఈ టాక్‌టైమ్ వ్యాలిడిటీ ఐదు రోజులు మాత్రమే. రాఖీ ఆఫర్‌ ఆగస్టు 3 గురువారం నుంచి 12 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. .

BSNL ఆఫర్స్

> ట్రిపుల్ ఏస్ ఎస్‌టీవీ 333 ఆఫర్ : అపరిమిత డేటా. రోజుకు 3GB వరకు ఎఫ్‌యూపీ పరిమితి ఉంది. 3GB మించితే డేటా స్పీడ్ 80 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 90 రోజులు.

> దిల్ కోల్ కే బోల్ ఎస్‌టీవీ 349 ఆఫర్: లోకల్ సర్వీస్ ఏరియా పరిథిలో అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ)తో పాటు రోజుకు 2జీబీ డేటా అందుకోవచ్చు. 2జీబీ డేటా మించితే స్పీడ్ 80 కేబీపీఎస్‌కు పరిమితమవుతుంది. వ్యాలిడిటీ 28 రోజులు.

> నెహ్లే పే దెహ్లా ఎస్‌టీవీ 395 ఆఫర్ : 3000 నిమిషాల ఆన్ నెట్ వాయిస్ (లోకల్, ఎస్టీడీ)తో పాటు 1800 నిమిషాల ఆఫ్‌నెట్ వాయిస్ (లోకల్, ఎస్టీడీ) కాల్స్ ఉచితంగా అందుకోవచ్చు. ఉచిత కాల్స్ పరిమితి అయిపోయాక  కాల్‌కు 20 పైసలు చార్జి పడుతుంది. వీటితో పాటు రోజుకు 2జీబీ డేటా అందుకోవచ్చు. వ్యాలిడిటీ 71 రోజులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy