BWF వరల్డ్ టూర్ 2018 : ఫైనల్ చేరిన సింధు

 చైనా లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్ టూర్ లో పీవీ సింధూ సత్తా చాటింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌ కు చెందిన రచనోక్‌ ఇంతనోన్‌ను 21-16, 25-23 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ 54 నిమిషాలు కొనసాగింది. మొదటి రౌండ్ లో 6-4 తేడాతో సింధు ఆధిక్యం లో ఉండగా.. రెండవ రౌండ్ రచనోక్‌ గట్టి పోటీ ఇచ్చింది. ఈ గేమ్ టై బ్రేక‌ర్ వ‌ర‌కు వెళ్లింది. హోరాహోరీగా సాగిన టై బ్రేక‌ర్‌ను సింధు 25-23తో కైవ‌సం చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో సింధు జపాన్‌ ప్లేయర్ నొజోమి ఒకురహతో తలపడనుంది. గతేడాది కూడా ‘బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్ టూర్’ లో  వీరిద్దరి మధ్యే ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్ లో సింధు పై నొజోమి గెలిచింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy