CBSE పేపర్ లీక్ కేసులో ముగ్గురు అరెస్ట్

310CBSE పేపర్ లీక్‌ కేసులో ఈ రోజు(ఏప్రిల్1) ఉదయం ముగ్గరుని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు టీచర్లు కాగా మరొకరు ఓ కోచింగ్ సెంటర్ యజయాని. రోహిత్‌, రిషాబ్‌ అనే ఇద్దరు టీచర్లు ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ పేపర్ ను ఓ కోచింగ్‌ సెంటర్ రన్ చేస్తున్న తాఖిర్‌ అనే వ్యక్తికి వాట్సాప్‌ ద్వారా పంపించారన్న ఆరోపణలతో వీరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న 60 మందిని పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాకు చెందిన 12 మందిని శనివారం(మార్చి31) ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు 10వ తరగతి మ్యాథ్స్ పేపర్ లీక్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఏడుగురు విద్యార్థులతోపాటు ఐదుగురు కోచింగ్‌ సెంటర్ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy