CBSE పేపర్ లీక్ కేసులో ముగ్గురు అరెస్ట్

cbseCBSE ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ క్వచ్చన్ పేపర్ లీక్ చేసిన కేసులో సంబంధం ఉన్న ముగ్గురుని ఈ రోజు(ఏప్రిల్-7)  ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో ఓ టీచర్, క్లర్క్ తో సహా మరో ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల క్రితం ఇదే కేసులో ఢిల్లీకి చెందిన ఇద్దరు టీచర్లు, ఓ కోచింగ్ సెంటర్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదవ తరగతి మ్యాథ్స్ ఎగ్జామ్ పై లీకేజీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆ పరీక్షను తిరిగి నిర్వహించడం లేదని CBSE ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ రీ ఎగ్జామ్ ఈ నెల 25న నిర్వహించనున్నట్లు CBSE ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy