CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల

cbseసెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(CBSE) 10వ తరగతి ఫలితాలు మంగళవారం(మే-29) విడుదలయ్యాయి. మొదట మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించినా.. కొన్ని కారణాల రీత్యా మధ్యాహ్నమే ఫలితాలను రిలీజ్ చేశారు. cbse.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్లతో పాటు ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ ద్వారా కూడా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 16లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాశారు.

మార్చిలో నిర్వహించిన CBSE పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. 10వ తరగతి  గణిత ప్రశ్నాపత్రం పరీక్ష ముందుగానే లీకైంది. అయితే ఆ పరీక్షను తిరిగి నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (HRD) మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy