CCTVలతో పోలీసులు ఈజీగా కేసులను ఛేదిస్తున్నారు : కేటీఆర్

తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారని కేంద్రం ప్రశంసించిందన్నారు మంత్రి కేటీఆర్. సీసీ కెమెరాలతో పోలీసులు చాలా కేసులను ఈజీగా ఛేధిస్తున్నారని చెప్పారు.శనివారం (ఆగస్టు-4) GHMC డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 120 మందికి రెండు నెలలు శిక్షణ ఇచ్చామన్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేలా 8వాహనాలు.. 120మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇప్పటివరకు 8వేల ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించామన్నారు. కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటుపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

హైదరాబాద్ లో అన్ని రకాల మౌలిక వసతులు పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసు యంత్రాంగం, ఫైర్‌ శాఖలను మరింత బలోపేతం చేసే విధంగా ఈ డీఆర్‌ఎఫ్‌ ఉంటుందన్నారు. ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుని దీన్ని రూపొందించామని చెప్పారు. నేరాలను నియంత్రిస్తూ హైదరాబాద్‌ ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరితో కలిసి ముందుకువెళ్తున్నామని తెలిపారు కేటీఆర్‌.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy