సిమ్ లేని సిత్రమైన ఫోన్.. చార్జింగ్ పోర్ట్, బటన్లూ లేవు

మనం మాట్లాడేది అవతలి వాళ్లకు వినిపించేందుకు స్పీకర్‌ ఉంటుంది. మన మాట ఆ స్పీకర్‌ వరకు చేరేందుకు కింద చిన్న చిన్న రంధ్రాలుంటాయి! చార్జింగ్‌ పెట్టేందుకు పోర్ట్‌‌.. అదీ ఓ రంధ్రమే! పాటలు వినడానికి, ఫోన్‌ మాట్లాడడానికి.. హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకునేలా ఓ పోర్ట్‌‌.. అది ఇంకో రంధ్రం ! ఫోన్‌ ఆన్‌ ఆఫ్‌ బటన్‌ ఒకటి.. సౌండ్‌ కోసం ఇంకో రెండు బటన్లు! ఇలా ప్రతి ఫోన్లోనూ కనిపించే ఫీచర్లవి. అవేవీ లేకుండా.. అసలు ఫోన్‌ మాట్లాడడానికి కావాల్సిన సిమ్‌ లేకుండా ఫోన్ వస్తే..? ఇప్పుడు అదే మోడల్లో ఓ కొత్త ఫొనొస్తోంది. చైనా కంపెనీ తీసుకొస్తున్న ఆ వింత ఫోన్ పేరు ‘మైజు జీరో’.

ఎలా పనిచేస్తుంది?

  • డిజైన్‌లో చిన్న గీత గానీ, రంధ్రం గానీ లేని, కేవలం గ్లాస్‌ , మెటల్‌ తో తయారు చేసిన ఈ ఫోన్‌ వైర్‌ లెస్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.
  • దీంట్లో సిమ్‌ వేసుకోవడానికి లేదు. ఈ–సిమ్‌ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ–సిమ్‌ కనెక్టివిటీ ఉన్న ఆపరేటర్లయితేనే ఈ ఫోన్‌ పనిచేస్తుంది.
  • వాల్యూమ్‌ , పవర్‌ బటన్‌లు లేవు కదా. కాబట్టి అది కెపాసిటివ్‌ సెన్సర్లతో పనిచేస్తుంది. హెచ్‌టీసీ యూ12+ మోడల్‌ లో ఫోన్‌ అంచుకు కెపాసిటివ్‌ సెన్సర్లను పెట్టినట్టే దీనికీ పెట్టారు. ఆ సెన్సర్లే పవర్‌, వాల్యూమ్‌ బటన్లుగా పనిచేస్తాయి.
  • స్పీకర్లు, గ్రిల్స్‌కు బదులు పీజోఎలక్ట్రిక్‌ ట్రాన్స్‌ డ్యూసర్స్‌ సాయంతో మాటను అవతలి వారికి చేరవేస్తాయి. మనకు వినపడేలా చూస్తాయి. అందుకు స్క్రీన్‌నే అవి వాడుకుంటాయి. ఇయర్‌ రిసీవర్‌గా పనిచేయాలన్నా, లౌడ్‌ స్పీకర్‌ కావాలన్నా స్క్రీన్‌
  • వైబ్రేట్‌ అవుతుంది.
  • వైర్లెస్చార్జర్తోనే ఫోన్బ్యాటరీ ఫుల్అవుతుంది. 18 వాట్ల ఫాస్ట్‌‌ వైర్‌ లెస్‌ చార్జింగ్‌ దీని సొంతం.
  • మిగతా ఫీచర్లు దాదాపు అన్ని ఫోన్లలాంటివే. 20 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా సహా సోనీ ఐఎంఎక్స్‌ 380+ఐఎంఎక్స్‌ 350 రెండు కెమెరాలున్నాయి. వాటర్​, డస్ట్​ రెసిస్టెంట్​. స్నాప్‌ డ్రాగన్‌ 845 చిప్‌తో పనిచేసే ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌తో వస్తుంది. 5.99 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ ప్లే మరో ఆకర్షణ.
  • ధర, ఎప్పుడు రిలీజ్‌ చేసేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. జస్ట్ దాని ఫీచర్లను చూపిస్తూ టీజర్‌ను రిలీజ్‌ చేసిందంతే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy