మూడోస్సారి… CM కిరణ్ as it is…

CMసీఎం కిరణ్ కుమార్ రెడ్డి T బిల్లుపై తన అభిప్రాయాల వెల్లడి తతంగాన్ని మొత్తానికి ముగించారు. ఆయన లెక్కల పట్టిక, క్రికెట్ కామెంటరీ, బిల్లు లోపాలు, కేంద్రం తప్పులు, తెలంగాణా వాళ్ళు పడబోయే బాధలు, అన్నింటి కన్నా తన హృదయ ఘోష గురించి ఆయన చాలా కష్టపడి తెలుగులో చేసిన ప్రసంగం… as it is…

ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు
బొగ్గు కేటాయింపులు చేసేది కేంద్రమే..
ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది, గ్యాస్ కావాలని కేంద్రానికి ఘాటుగా లేఖ రాశా
శంకర్ పల్లి, కరీంనగర్ లో గ్యాస్ ప్రాజెక్టులు ప్రారంభించని మాట వాస్తవమే..
వరి ఉత్పత్తి తెలంగాణలో బాగా పెరిగింది, సాగు విస్తీర్ణం కూడా పెరిగింది..
ఇరిగేషన్, పవర్, విద్యలో తెలంగాణ బాగా వృద్ధి చెందింది..
స్కూళ్లు, కాలేజీల సంఖ్య తెలంగాణలోనే పెరిగింది..
ముఖ్యమంత్రులంతా తెలంగాణను అభివృద్ధి చేశారు..
నా స్నేహితులంతా తెలంగాణ వారే..
ఆంధ్రాకు కాదు.. హైదరాబాద్ కే క్రికెట్ కు ఆడా..
ఆంధ్రావాళ్ళు క్రికెట్ ఆడాలని కోరినా ఆడలేదు..
చదువు, ఉద్యోగాల కోసం అందరూ హైదరాబాద్ కు వస్తుంటారు..
విభజన జరిగితే ఎమోషనల్ అటాచ్ మెంట్ పోతుందనే మా బాధ
ఇది మీ రాష్ట్రం కాదంటే దురదృష్టమని నేను సోనియాకే చెప్పా..
రెండు రాష్ట్రాలు చేయాల్సిన అవసరం ఏముందని అడిగా..
ఢిల్లీలో చెప్పిందే ఇక్కడ చెబుతున్నా..
పెద్ద పెద్ద ఆస్పత్రులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి..
కర్నూలు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే ఆలంపూర్ వాళ్లు విడపోవద్దని కోరుతున్నారు..
ఆలంపూర్ లో పూలు అమ్మే కర్నూలు వాళ్లు విడిపోతే ట్యాక్స్ వేస్తారా అని అడుగుతున్నారు..?
భవిష్యత్ లో అందరూ తెలంగాణ ముఖ్యమంత్రులైనా మేం బాధ పడం..
కానీ విడిపోతే నష్టం జరుగుతుందనే మా బాధ
విడిపోతే ఢిల్లీలో మన బలం తగ్గుతుంది
హైదరాబాద్ అందరిదీ.. అభివృద్ధికి అందరు ప్రయత్నించారు..
చుట్టుపక్కల జిల్లాల్లో అందుకే పరిశ్రమలు వచ్చాయి..
సమైక్యంగా ఉంటేనే మరింత అభివృద్ధి జరుగుతుంది..
టీ బిల్లులో హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అంశాన్ని ఆషామాషీగా చూశారు..
హైదరాబాద్ చాలా సున్నితమైన ప్రాంతం, వినాయక చవితి లాంటి సమయాల్లో ఆంధ్రా నుంచి పోలీస్ సిబ్బందిని తీసుకొస్తాం, విభజన జరిగితే అంతమంది సిబ్బందిని ఎక్కడి నుంచి తెస్తారు..
అంతమందిని రిక్రూట్ మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.. లేకపోతే ఇబ్బందులు తప్పవు
నక్సల్స్ నుంచి దేశానికి ముప్పు ఉందని ప్రధాని చెప్పారు, మావోయిస్టు నేతల్లో తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారు, ప్రస్తుతం పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు కాబట్టి నక్సల్స్ ను అణచివేస్తున్నాం..
విడిపోతే రెండు ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తాయి..
కలిసి ఉన్నందున ప్రస్తుతం మనకు నిధులు ఎక్కువగా వస్తున్నాయి..
నిధులు ఉన్నందువల్లే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం..
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేస్తే వారికి మేలు జరుగుతుంది..
విడిపోతే ఉద్యోగుల సంఖ్య పెరిగి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది
నేను ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగా, ముఖ్యమంత్రి అయ్యాక నేను హైదరాబాదీనని చెప్పా
హైదరాబాద్ గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, అడ్వకేట్ జనరల్ గా తెలంగాణ వ్యక్తిని నేనే నియమించా, తెలంగాణ ప్రజలను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు
చాలా సమయాల్లో తెలంగాణ వాళ్లు నాకు సహకరించారు..
అవిశ్వాసం సమయంలో తెలంగాణ నేతలు నాకు అండగా నిలిచారు..
ప్రాణహిత-చేవెళ్లను పూర్తి చేయాలని కోరుకుంటున్నా, రైతులకు మేలు చేయాలనేదే నా ప్రయత్నం

నలుగురు తెలంగాణ వ్యక్తులు ముఖ్యమంత్రిగా చేశారు..
ముఖ్యమంత్రులను తీసేది.. పెట్టేది కాంగ్రెస్ హైకమాండ్
తెలంగాణ వారికి పదవులు రాకపోవడానికి ఆంధ్రా వాళ్లు కారణం కాదు..
అప్పుడున్న పరిస్థితుల వల్లే ఆ సీఎంలను మార్చారు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కోరా, వెనకబడ్డామనే భావన తొలిగించేందుకే ప్యాకేజీ ఇవ్వాలని చెప్పా
తెలంగాణను ఇవ్వకూడదనే ఉద్దేశం నాకు లేదు
విడిపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పేందుకే నేను ప్రయత్నిస్తున్నా..
బిల్లు ఏకపక్షంగా ఉందని నేను ప్రెసిడెంట్ కు, ప్రధానికి లేఖలు రాశా
ప్రజల్లో ఏకాభిప్రాయం తేవడానికి ప్రయత్నించాలని చెప్పా,

నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రపతికి బిల్లు పంపారు..
మనకు వచ్చిన బిల్లులోనూ చాలా లోపాలున్నాయి, అదనపు సమాచారం కోరితే అసెంబ్లీకి పంపింది డ్రాఫ్ట్ బిల్లు అని చెప్పారు, అసెంబ్లీకి వచ్చింది బిల్లా.. డ్రాఫ్ట్ బిల్లా..?
విభజన ఉద్దేశం, లక్ష్యాలు బిల్లులో పేర్కొనలేదు..
కేంద్రం అభిప్రాయం చెప్పకుండా.. అసెంబ్లీని చెప్పాలంటే ఎలా..?
బిల్లులో ఎన్నో పొరపాట్లు, తప్పులున్నాయి, కామన్ క్యాపిటల్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు..
హైదరాబాద్ పై గవర్నర్ పెత్తనాన్ని ఒప్పుకోం, పవర్, ఎంప్లాయిస్ విషయంలోనూ ఇబ్బందులున్నాయి..
సమైక్యాన్ని కోరుకుంటున్నా… నేను కాంగ్రెస్ వాదినే..
జై ఆంధ్రా ఉద్యమం సమయంలోనూ మా కుటుంబం సమైక్యాన్నే కోరుకుంది..
విభజన మంచిది కాదని నేను మా నాయకురాలికి చెప్పాను..
రెండు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పా
ముఖ్యమంత్రుల విషయంలో కాంగ్రెస్ హైకమాండే తప్పు చేసింది..
రాష్ట్ర ప్రజలకు ఏది మేలో అదే చెబుతున్నా

విభజన జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీరు రాదు..
ప్రస్తుతం కడుతున్న ప్రాజెక్టులు వృథా అవుతాయి
ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం చేతికి వెళ్తే ఇబ్బందులొస్తాయి..
విడిపోతే కరెంట్, ఇరిగేషన్ ను బ్యాలెన్స్ చేయడం కష్టం
పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు, కలిసుంటేనే పోలవరం పూర్తవుతుంది..
సమైక్య రాష్ట్రంలోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి, తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంది
విడిపోతే రైతులు ఇబ్బందులు పడక తప్పదు, సింగరేణి బొగ్గు కేటాయింపులపై టీవాదులది అనవసర రాద్దాంతం
ఒక్క టన్ను బొగ్గు ఆంధ్రాకు కేటాయించలేదు

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy