హైదరాబాద్ లో పెరిగిన చలి

హైదరాబాద్ లో చలి విజృంభిస్తుంది. నవంబర్ నెలలోనే హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రాత్రి హైదరాబాద్ లో చలి 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతకు పడిపోయింది. ఇది సాధారణస్థాయి కంటే 2.2 డిగ్రీలు తగ్గి స్థిరంగా కొనసాగింది. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. పగలు సాధారణ స్థాయికంటే 2.2 డిగ్రీలు పెరుగడంతో ఎండతీవ్రత అధికంగా ఉంటున్నది. సాయంత్రం ఆరుగంటలకే చలి మొదలై.. రాత్రి సమయానికి తీవ్రంగా మారుతున్నది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చలి అనుకోకుండా పెరగడంతో నగరవాసులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేవారు ముఖాలకు, చేతులకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy