DE ఇళ్లపై ఏసీబీ దాడులు-పట్టుబడ్డ ఆస్తులు

ACBకామారెడ్డి జిల్లా బాన్సువాడలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (DE) కాటపల్లి శ్రవణ్‌కుమార్‌రెడ్డి అక్రమాస్తులు రూ. 5 కోట్ల పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఆయన అక్రమాస్తులపై శనివారం (జనవరి-20) ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బాన్సువాడ, ఆయన తల్లిదండ్రులున్న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్, ఆయన కుటుంబసభ్యులుంటున్న హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ACB బృందాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో రూ.1.70 కోట్ల ఆస్తులు గుర్తించగా.. ప్రస్తుతం మార్కెట్‌ ప్రకారం రూ.5 కోట్ల వరకు ఆస్తులుంటాయని ఏసీబీ డీజీ పూర్ణ చందర్‌రావు తెలిపారు. శ్రవణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, వర్ని, రుద్రూర్‌ మండలాల ఇరిగేషన్‌ డీఈగా శ్రవణ్‌కుమార్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఉదయాన్నే అద్దె ఇంట్లో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కార్యాలయంలో, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లోని ఆయన తల్లిదండ్రుల ఇళ్లలో సోదాలు జరిపారు. కుత్బుల్లాపూర్‌ పరిధి సుచిత్రా గ్రీన్‌పార్క్‌ కాలనీలోని విశాలమైన భవంతిలో ఆయన కుటుంబ సభ్యులు ఉండగా.. ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ACB గుర్తించిన ఆస్తులు…

… జీడిమెట్లలో రూ.50 లక్షల విలువైన (జీ ప్లస్‌) బిల్డింగ్
… బేగంపేటలో రూ. 25 లక్షల విలువైన 2,100 ఎస్‌ఎఫ్‌టీ గల ప్లాట్‌
…జీడిమెట్లలో రూ. 20 లక్షల  విలువైన కమర్షియల్‌ కాంప్లెక్స్‌
…నిజామాబాద్‌లోని నవీపేట్, ఆర్మూర్‌ పరిధిలో రూ.62.81 లక్షల విలువగల 34 ఎకరాల వ్యవసాయ భూమి
…అల్వాల్‌లో రూ. 2.5 లక్షల విలవైన ఓపెన్‌ ప్లాట్‌
…మేడ్చల్‌లో రూ.15 లక్షల విలువైన ఓపెన్‌ ప్లాట్‌
…నిజామాబాద్‌ సెంటర్ లో రూ.2.4 లక్షల విలువైన ఖాళీ స్థలం
… రూ.14 లక్షల విలువగల బంగారు, వెండి నగలు
… రూ.50 వేల నగదు, రూ.3 లక్షల ఇన్సూరెన్స్‌ బాండ్లు
…నాలుగు బ్యాంకు ఖాతాల్లో రూ.12.90లక్షల నగదు, రూ.11.98 లక్షల చిట్టీలు
…రూ.5 లక్షల విలైన ఫర్నీచర్, రూ.12 లక్షల విలువైన కారు
… రూ.11లక్షల విలువగల మరో రెండు కార్లు, రూ.50 వేల విలువగల బైక్‌లు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy