తెలంగాణ బిల్లుపై ఉత్కంఠత…

telanతెలంగాణ బిల్లు టైం సెషన్ పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ్టీతో ముసాయిదా బిల్లుపై గడువు ముగుస్తుండటంతో…అన్ని పార్టీల నేతలు అసెంబ్లీలో, మండలిలో అనుసరించాల్సిన వ్యూహ,  ప్రతివ్యూహాలు రూపొందించుకున్నారు. బిల్లుపై చర్చకు గడువు పెంచాలంటూ సీఎంతో పాటు సీమాంధ్ర నేతలు రాసిన లేఖపై.. ఎలాంటి సమాధానం రాలేదు. ఇవాళ ఫైనల్ డెసిషన్ రావొచ్చని భావిస్తున్నారు. అయితే పొడిగింపు ఉండదని మరికొందరంటున్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో  స్పీకర్ ఎలా వ్యవహరిస్తారన్నదే కీలకం. దీనిపై ఇప్పటికే రాజ్యాంగ నిపుణులను సంప్రదించారు. ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. బిల్లు రాష్ట్రపతి నుంచి వచ్చింది కాబట్టి… చర్చ ముగిసిన తర్వాతే సీఎం నోటిసును స్పీకర్ ప్రవేశపెట్టే అవకాశముంది.  బిల్లుపై సభ్యులు ఓటింగ్ కోరినా దానికీ అవకాశం కనిపించట్లేదు. సీఎం నోటీస్ పై ప్రతిష్టంభన నెలకొంది.

నోటీసు ఉపసంహరించుకోవాలంటున్న తెలంగాణ నేతలు ఇవాళ కూడా దానికే పట్టుబట్టే అవకాశముంది. అదే జరిగితే ఓటింగ్ లేకుండానే సభ ముగిస్తారని తెలుస్తోంది.  టీ-బిల్లు గడువుపై అటు సీమాంధ్ర…ఇటు తెలంగాణ నేతలు ఎవరివారు జోరుగా లాబీయింగ్ నిర్వహించారు. సీమాంధ్ర మంత్రులు ఆనం, రఘువీరా, పితాని, శైలజానాధ్, వట్టి స్పీకర్ ను కలిశారు. సీఎం నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని, సభలో తీర్మానం ప్రవేశపెట్టించాలని కోరారు. అటు తెలంగాణ మంత్రులు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డిల చాంబర్లలో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇవాళ సభలో ఏం చేయాలనే దానిపై చర్చించారు. బిల్లుపై ఓటింగ్ ను అంగీకరించరాదని, సభలో సీఎం తీర్మానానికి అవకాశమే ఇవ్వరాదన్న అభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ సీమాంధ్రులకు ఎలాంటి తీర్మానానికైనా స్పీకర్ అవకాశమిచ్చినా అడ్డుకోవాలని నిర్ణయించారు. మొత్తానికి సభలో తెలంగాణ బిల్లు చర్చపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ గడువు మరికొద్దిగంటల్లో ముగుస్తుండటంతో… ఇరు ప్రాంత నేతలు పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy