రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కు ముస్తాబవుతున్న రాజ్ పథ్

RepublicDay-Parade-2013-011రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కు ఢిల్లీ రాజ్ పథ్ ముస్తాబైంది. సైనికులతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాలకు చెందిన కళాకారులు ముందస్తుగా రిహార్సల్స్ నిర్వహించారు. ఈసారి వేడుకలకు జపాన్ ప్రధాని షింజో అబే ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి 26వ తేదీ వరకు పాస్ లు లేకుండా… ఎవరినీ అనుమతించటంలేదు. ఇంటెలిజన్స్ అలర్ట్స్ తో కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం ఇండియా గేట్ వద్ద సైనికులకు నివాళులర్పించి… ప్రధాని మన్మోహన్ వేడుకలను ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ జెండా ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు సైనిక విన్యాసాలు కన్నులపండువగా జరగనున్నాయి. ఈసారి వైమానిక దళానికి చెందిన 30 యుద్ధ విమానాలను ప్రదర్శించనున్నారు. అలాగే బీఎస్ఎఫ్, ఎస్ఎస్ బీ, ఆర్మీకి చెందిన 25 బెటాలియన్ల జవాన్లు… దేశవ్యాప్తంగా 1200 పాఠశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు కవాతులో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.  రేపటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో ప్రతిభ చూపిన సైనికులకు మెడల్స్ తో పాటు.. ఉత్తమ శకటాలకు అవార్డులు అందించనున్నారు.

మన రాష్ట్రం శకటం  ప్రదర్శనకు ఈసారి కూడా అవకాశం లభించలేదు. గణతంత్ర వేడుకలకు మన రాష్ట్రం శకటం లేకపోవటం ఇది నాలుగోసారి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy